జనసేన పార్టీ అధ్యక్షుడిని వెంటాడుతున్న నవతరం పార్టీ

పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్న జనసేన పార్టీని నవతరం పార్టీ వెంటాడుతోంది. గత సాధారణ ఎన్నికల్లో జనసేనకు గాజుగ్లాసు గుర్తును ఈసీ కేటాయించింది. అయితే ఆ పార్టీ తర్వాత వరుస ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో.. జనసేన గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ లిస్టులో చోటు దక్కకపోవడంతో గాజుగ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ గా ఈసీ ప్రకటించింది. దాంతో తిరుపతి ఉప ఎన్నికల్లో ఈ గుర్తును నవతరం పార్టీ సొంతం చేసుకుంది. చివరకు తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన జనసేన తమ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయవద్దని ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ( అసెంబ్లీ రద్దు చేయాలంటున్న టీడీపీ )

జనసేన వెబ్సైట్ పై గురి పెట్టిన నవతరం పార్టీ

ఇప్పుడు బద్వేలు ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాస్ గుర్తును నవతరం పార్టీనే సొంతం చేసుకుంది. ఇలా గాజు గ్లాస్ గుర్తును సొంతం చేసుకున్న నవతరం పార్టీ ఇప్పుడు జనసేన అధికారిక వెబ్సైట్ పై గురి పెట్టింది. జనసేన అధికారిగా వెబ్సైట్ పై భారత ఎన్నికల కమిషన్ కు నవతరం పార్టీ ఫిర్యాదు చేసింది. గాజు గ్లాస్ గుర్తును నవతరం పార్టీకి కేటాయించినప్పటికీ.. బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్న జనసేన, తన అధికారిక వెబ్ సైట్ లో మాత్రం గాజుగ్లాసు గుర్తును అలాగే ఉంచిందని ఫిర్యాదులో నవతరం పార్టీ వివరించింది.

తమకు కేటాయించిన గుర్తును జనసేన తన గుర్తుగా వెబ్ సైట్ లో ఉంచడం సరికాదని.. కాబట్టి దాన్ని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రమణ్యం కోరారు. ఒకవైపు తన వెబ్సైటు లో గాజుగ్లాసు గుర్తును అలాగే ఉంచి.. బద్వేలు ఉప ఎన్నికల్లో మాత్రం గ్లాస్ గుర్తుకు ఓటు వేయవద్దని.. బిజెపి గుర్తుకే ఓటు వేయండి అటు జనసేన ప్రచారం చేస్తోందని వివరించింది. ( నారా లోకేష్ పాదయాత్ర )

ఈ పరిణామం కారణంగా తమ నవతరం పార్టీ అభ్యర్థికి బద్వేలు ఉప ఎన్నికల్లో నష్టం చేకూరే అవకాశం ఉందని.. కాబట్టి జనసేన అధ్యక్షుడికి నోటీసులు జారీ చేసి జనసేన వెబ్ సైట్ నుండి గాజు గ్లాసు గుర్తును తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఈసీని కోరారు. తమ నవతరం పార్టీ గుర్తుకు వ్యతిరేకంగా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రచారం చేయకుండా నిలువరించాలని కూడా ఈసీని నవతరం పార్టీ కోరింది.

మొత్తం మీద గాజు గ్లాస్ గుర్తును నవతరం పార్టీకే కేటాయించిన నేపథ్యంలో జనసేన వెబ్ సైట్ నుండి ఆ గుర్తును తొలగించాలన్న విజ్ఞప్తిపై ఈసీ సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే జనసేన గాజు గ్లాసు గుర్తును ఇక మర్చిపోవాల్సిన పరిస్థితి రావచ్చు.

1 thought on “జనసేన పార్టీ అధ్యక్షుడిని వెంటాడుతున్న నవతరం పార్టీ”

Leave a Comment