ప్రధాని నరేంద్ర మోదీ 20 ఏళ్ళ ప్రస్థానం..

ప్రధాని మోదీ ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన ట్రెండ్ ను ఫాలో కారు.. ట్రెండ్ సెట్ చేస్తారు. ఆయనది బలమైన రాజకీయ కుటుంబం కాదు. రాజకీయాల్లోకి రాకముందు ఎమ్మెల్యే, ఎంపీ అంతకన్నా కాదు. కానీ ఎవరికైనా సరే ఆయన ఎంట్రీయే అదుర్స్ అనిపిస్తుంది. నేరుగా సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మరీ పవర్ పాలిటిక్స్ లోకి డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చారు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 ఏళ్లుగా అప్రతిహతంగా ఆయన దూసుకుపోతూ ఉన్నారు. గెలవాలి.. గెలిచి తీరాలి అన్న లక్ష్యసాధనలో ఆయన ఎన్నడూ వెనుతిరిగి చూసింది లేదు. తనదైన నడవడితో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. దేశమంతటా విజయదుందుభిలను మ్రోగించారు. కాంగ్రెస్ నే కాదు, రాష్ట్రాలను తమ జాగీరుగా భావించే ప్రాంతీయ పార్టీల నేతల కోటలను సైతం బద్దలు కొట్టారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు కాషాయ జెండాను రెపరెపలాడించారు. కాలం అనేది నిరంతర ప్రవాహం. ఇది ఎవరి కోసం ఆగడు. కానీ ఆ కాలమే ఒక యుగపురుషుడును గుర్తిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. కాలం గుర్తించిన ఆ యుగకర్తయే ప్రధాని నరేంద్ర మోడీ.

2001 వ.సంవత్సరం గుజరాత్ బీజేపీలో చెలరేగిన అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిని ఎంపిక చేసే బాధ్యత బీజేపీ అధిష్టానంపై పడింది. అప్పటి బీజేపీ సీనియర్ నేత భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి నుంచి మోదీకి పిలుపు వచ్చింది. అది కూడా ఉదయం మా ఇంటికి అల్పాహారానికి వచ్చేయమని. అప్పటివరకు మోదీకి కూడా తెలియదు అటల్జీ ఎందుకు పిలిచారోనని. అల్పాహారం చేస్తూనే అటల్జీ.. నరేంద్ర భాయ్ మీరు గుజరాత్ సీఎంగా వెళ్తున్నారు.. ఇది పార్టీ నిర్ణయమని చెప్పారు. అటల్జీ లాంటి కర్మయోగి నోట వెలువడిన ఆ మాటలు అక్షర సత్యాలు అయ్యాయి. వరుస విజయాలతో బీజేపీనే కాదు, ఇండియాను సైతం గెలిపించారు మోదీ.

24hours current

సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం, అక్టోబర్ 7, 2001లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు కూడా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నదే లేదు. నేరుగా సీఎం అయ్యారు. ఆ తర్వాత భారీ మెజారిటీతో ఎమ్మెల్యే అయ్యారు. ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన వెనుతిరిగి చూసింది లేదు. వరుస విజయాల పరంపరను కొనసాగించారు. అయితే గోద్రా ఘటన అనంతరం చెలరేగిన అల్లర్లను సాకుగా చూపించి నేషనల్ మీడియా అయితే ఆయనపై దుమ్మెత్తిపోసింది. విపక్ష పార్టీలు, ఎన్జీవో సంఘాల మాటున కేసులు వేయించారు.

24 గంటల నిరంతర విధ్యుత్

ఎన్నో అవమానాలకు గురి చేశారు. కాని వాళ్ళకేం తెలుసు మోదీ ఒక స్థితప్రజ్ఞుడని. అవమానాలకు కృంగిపోవడం.. పొగడ్తలకు, సంతోషాలకు పొంగిపోవడం ఆయనకు తెలియదని. మోడీకి తెలిసింది ఒక్కటే. తనదైన వ్యూహాలతో గుజరాత్ మోడల్ ను డెవలప్ చేశారు మోడీ. ఎన్నికలు అనగానే ఆల్ ఫ్రీ ఎజెండాతో ముందుకు వచ్చే పార్టీలకు భిన్నంగా వ్యవహరించేవారు. నవరాత్రి మహోత్సవాలకు గుజరాతి పెట్టింది పేరు. సరిగ్గా ఆ సమయంలో వైబ్రెంట్ గుజరాత్ తొలిసారి నిర్వహించారు. బడా బడా కార్పొరేట్ కంపెనీలను ఆహ్వానించి గుజరాత్ అభివృద్ధికి బాటలు వేశారు. జ్యోతి గ్రామ్ యోజన ద్వారా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చారు.

రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న విద్యుత్ కంపెనీలను లాభాల బాట పట్టించారు. గుజరాత్ లోని అన్ని గ్రామాలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయించారు. ఆ రోజుల్లో దేశంలోని 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం గా గుజరాత్ నిలిచింది. కరెంటుకు డోకా లేకపోవడంతో ఆ కంపెనీలు అన్నీ కూడా గుజరాత్ వైపు చూసాయి. 2005లో ఆయన ప్రారంభించిన బేటీ బచావో అభియాన్ గుజరాత్లో ప్రతి ఒక్కరిని కదిలించింది. లింగ వివక్షను దూరం చేసింది. అంతేకాదు పాఠశాలకు పంపే బాలికల సంఖ్య కూడా పెరిగింది. 2007లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడో సారీ ఘనవిజయం సాధించిందంటే కారణం నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి పనులు అని అంటారు విశ్లేషకులు.

Beti Bachavo

2008లో టాటా కంపెనీ నానో కార్ల ఫ్యాక్టరీని పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ లో ఏర్పాటు చేయాలని భావించింది. అయితే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి, ఎన్నో అడ్డంకులు సృష్టించారు. ఆ సమయంలో కేవలం ఒక్క ఎస్ఎంఎస్ ద్వారా మోడీ టాటా నానో కార్ల ఫ్యాక్టరీని గుజరాత్ కు రప్పించారు. ఇంకా ఈ గ్రామ్, విశ్వ గ్రామ్ ప్రణాళికలు వేస్తారు. గుజరాత్ లోని ప్రతి గ్రామానికి బ్రాడ్బ్యాండ్ సేవలను అందించారు. గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిని నేరుగా ఆన్లైన్ సమీక్షలు జరిపిన మొదటి సీఎం కూడా నరేంద్ర మోడీయే. తర్వాత 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగో సారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోడీ గుజరాత్ మోడల్ పై ప్రపంచమంతా చర్చించ సాగింది.

ముచ్చటగా మూడోసారీ

డిసెంబర్ 26వ తేదీన మోడీ మూడోసారి గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే, రాబోయే రోజుల్లో భారత్ కు కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ అంటూ దేశవిదేశాల్లో సరికొత్త చర్చ ప్రారంభమైంది. అంతా అనుకున్నట్లుగానే 2013లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు తమ పార్టీ తరఫున నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. 2014 లో జరిగిన లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఒంటిచేత్తో బిజెపిని గెలిపించారు. దేశవ్యాప్తంగా 200కు పైగా భారీ ర్యాలీలో పాల్గొని సరికొత్త ట్రెండ్ ను సృష్టించారు. గతంలో ఏ పార్టీ నాయకుడు కూడా అన్ని సభలో పాల్గొన్నదీ లేదు. ఎన్నికల్లో బిజెపి 283 సీట్లు సాధించింది. కేంద్రంలో కాంగ్రెస్ తర్వాత లోక్సభలో మెజారిటీ సాధించిన పార్టీగా బీజేపీ నిలిచింది. పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎంపిక కావడమే కాదు, తమ పార్టీ మెజారిటీ స్థానాలలో గెలిపించి పార్లమెంటులో అడుగు పెట్టిన తొలి లీడర్ గా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారు.

GST bill

తన ప్రమాణస్వీకారం రోజునే సార్క్ సభ్య దేశాల అధినేతలను ఆహ్వానించి ఇరుగుపొరుగు దేశాలతో తాము సఖ్యతను కోరుకుంటున్నట్లుగా చెప్పకనే చెప్పారు. అంతే కాదు ప్రధాని కాగానే పీఎం మోదీ జరిపిన తొలి విదేశీ పర్యటన అగ్రదేశాలైన అమెరికా రష్యాలు కాదు. పీఎం గా మోడీ నేపాల్, భూటాన్ దేశాల్లో తొలి పర్యటన చేశారు. అలాగే తన విదేశీ పర్యటనను గతంలో ఏ భారతీయ పీఎం చేయని విధంగా విశ్వ వేదికపై భారత దేశ ప్రతిష్టను ఇనుమడింప చేశారు. ఏ దేశమేగినా ప్రతిచోట భారత్ కు జయజయకారాలు వినిపించాయి.

అమెరికా సైతం..

ఏ అమెరికా అయితే మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు US వెళ్లేందుకు వీసా నిరాకరించిందో, అదే అమెరికా తర్వాత కాలంలో మోదీకి రెడ్కార్పెట్ పరిచి మరీ వెల్కమ్ చెప్పిందంటే దట్ ఇస్ నరేంద్ర మోడీ. ఇంకా లెక్క పత్రంలోని భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మోది ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. పెద్ద నోట్ల రద్దు చేశారు. ఆర్థిక వ్యవస్థను డిజిటల్ మార్గంలో మళ్లించారు. GST ని తీసుకువచ్చి పన్నుల వ్యవస్థలో పారదర్శకతను తీసుకువచ్చే ప్రయత్నం చేసారు. యోగ దేవాస్ తో భారతీయ యోగాను విశ్వవ్యాప్తం చేశారు.

Statue of Unity

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్టాట్యూ ఆఫ్ యూనిటీ (statue of unity) తో జాతి జనులను మమేకం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే మోడీ సాధించిన విజయాలకు పేజీలు చాలవని నెటిజన్లు సైతం చెబుతారు. 2019 లో జరిగిన లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో సైతం బీజేపీ అఖండ విజయం సాధించి పెట్టారు. నరేంద్ర మోడీ వరుసగా రెండో సారి ప్రధానిగా జయకేతనం ఎగురవేశారు. తనదైన పనితీరుతో ఇప్పటికీ కూడా అలుపెరగని ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఈ ప్రయాణంలో ఆయన ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదంటే ఆయన కర్మనిష్ఠ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఇలా వరుసగా 20 ఏళ్లపాటు ఓటమి అనేది ఎరుగక అటు సీఎం గా ఇటు పీఎం గా దూసుకుపోతున్న నరేంద్ర మోడీ కారణం జన్ముడు కాక మరెవరు అని బిజెపి శ్రేణులు సంబరపడటంలో ఆశ్చర్యమేముంది.

Leave a Comment