సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేని టిడిపి నేతలు కొత్త కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా రకరకాల జిమ్మిక్కులకు పాల్పడుతూ చివరికి చేతులు కాల్చుకుంటున్నారు. ఇటీవల నారా లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన గోపాల్ ఆత్మహత్య లేక పోలీసుల ఇన్వెస్టిగేషన్లో నకిలీది అని తేలడంతో టిడిపి అసలు రంగు బయటపడింది. దీంతో టీడీపీ నిర్వాకంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జగన్ సర్కార్ ఇటీవల ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలండర్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. నిరుద్యోగులు ఆశించిన రీతిలో ఉద్యోగ ఖాళీలు లేకపోవడంతో సహజంగానే ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత కనిపించింది. దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎక్కువ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ప్రకటించిన జాబ్ క్యాలెండరు వల్ల నిరుద్యోగుల్లో నెలకొన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు టిడిపి దిగజారుడు రాజకీయాలకు తేరా తీసింది. ( అంత మాట అన్నాడా నారా లోకేష్ ..! )
గత ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న గోపాల్ అనే వ్యక్తి, ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్లనే మృతిచెందారని ఇటీవల నారా లోకేష్ తన ట్విటర్లో గోపాల్ ఆత్మహత్యకు సంబంధించిన లేఖను పోస్ట్ చేశాడు. నారా లోకేష్ పోస్ట్ చేసిన ఆత్మహత్య లేఖ పై స్థానిక పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయట పడింది. గోపాల్ అనే వ్యక్తి గత ఆరు నెలల క్రితం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆ సమయంలోనే గోపాల్ మృతదేహం వద్ద లభించిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆర్ధిక సాయం ఆశ చూపి
అయితే నారా లోకేష్ పోస్ట్ చేసిన లేక ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు పోలీసులు గోపాల్ కుటుంబ సభ్యులను విచారించారు. ఓ టిడిపి నేత గోపాల్ సోదరుడు శ్రీనివాస్ ను కలిసి నారా లోకేష్ కు తన తమ్ముడు రాసినట్లు లేఖ రాస్తే ఆర్థిక సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ లేఖ కూడా టిడిపి కార్యకర్తనే గోపాల్ రాసినట్టుగా ఆత్మహత్య లేఖ రాసినట్లు తెలిసింది. ఇక్కడే టిడిపి బొక్కబోర్లా పడింది. శ్రీనివాస్ అనే వ్యక్తికి కేవలం సంతకం చేయడం మాత్రమే తెలుసు.. చదవడం రాయడం రాదు.
ఆ లేఖలో వైసీపీ సర్కార్ వచ్చాక ప్రతియేటా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తారన్న ఆశతో డబ్బులు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకున్నట్లు రాశారు. తీరా జగన్ సర్కార్ జాబ్ క్యాలెండర్ లో తక్కువ పోస్టులు ప్రకటించడం చూసి ఆత్మహత్య చేసుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను గోపాల్ సోదరుడు శ్రీనివాస్ ఫోన్ నుంచే నారా లోకేశ్ కు సదరు టిడిపి నేతకు పంపించారు. గుడ్డిగా ఆ లెటర్ ను నారా లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులకు ఆ లేఖ నకిలీదని తేలడంతో నారా లోకేష్ ప్లాన్ బెడిసికొట్టినట్టు అయింది.