నారా లోకేష్ పాదయాత్ర.. నాయకుడిగా సక్సెస్ అవుతాడా.. ?

నారా లోకేష్ పాదయాత్ర | తెలుగు రాజకీయాలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పాదయాత్ర సుదీర్ఘంగా చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తన పాదయాత్రలో తన అడుగులను ఆదర్శంగా తీసుకుంటూ తరువాత చాలామంది పాదయాత్రలు చేశారు. కొందరు అధికారంలోకి రావాలని.. కొందరు నాయకులుగా ప్రొజెక్ట్ అవ్వాలని.. కొందరు జనం మధ్య ఉండాలి అని.. ఇంకొందరు తమ క్యాడర్ లో ధైర్యం నింపుకుంటూ ముందుకెళ్లాలి అన్న కారణాలతో పాదయాత్రలు చేశారు. అయితే ఇందులో కొందరు విజయం సాధించగా.. కొందరి పాదయాత్రలు ఫలితాన్ని ఇవ్వలేదు.

YSR Padayatra
YSR Padayatra

ఇక్కడ ముఖ్యంగా పాదయాత్రల గురించి చెప్పుకోవాలి అనుకుంటే దివంగత రాజశేఖరరెడ్డిగారు తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు.. మధ్యలో వైయస్ షర్మిల గారు మన తెలుగు రాష్ట్రాల్లో తమ పాదయాత్రలతో చెరగని ముద్రలు వేసిన వీళ్ళ అడుగులు కచ్చితంగా గుర్తుండిపోతాయి. మధ్యలో చంద్రబాబునాయుడు గారు కూడా పాదయాత్ర అని చెప్పి పాదయాత్ర, బస్సుయాత్ర రెండు కలిపి చేశారు. ఇప్పుడు మళ్లీ ఇన్ని రోజులకి తెలుగుదేశం పార్టీ నుండి నారా లోకేష్ పాదయాత్ర చేయబోతున్నారని దానికి సంబంధించి చర్చ జరుగుతోంది. పాదయాత్ర ఎలా నిర్వహించాలి.. దాన్ని ఎలా విజయవంతం చేయాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. అన్నీ ఒక కొలిక్కి వస్తే త్వరలోనే నారా లోకేష్ పాదయాత్ర చేయబోతున్నాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ సొంత మీడియాలో వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నాయి. ( బీజేపీ సరికొత్త వ్యూహం )

నారా లోకేష్ పాదయాత్ర ఎందుకంటే..

లోకేష్ పాదయాత్ర ఎందుకు చేయబోతున్నారో కూడా వీరు కొన్ని కారణాలు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత క్యాడర్ అనేది నిస్తేజంలోకి పోయింది. కరోనా వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు గారు.. లోకేష్ వీళ్ళిద్దరూ హైదరాబాద్ ఇళ్లకే పరిమితమయ్యారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ను పట్టించుకోలేదని.. క్యాడర్ లో ఎవరు యాక్టీవ్ గా లేరు. అందువల్ల క్యాడర్ ని యాక్టీవ్ గా చేసుకుంటూ , నియోజకవర్గ ఇంచార్జిలను బలోపేతం చేసుకుంటూ.. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారనేది ఆ వార్తల సారాంశం.

అయితే వీళ్ళు చెప్పే కారణాలు ఎలా వున్నా.. అవన్నీ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపుతాయా.. అసలు పాదయాత్ర విజయవంతం కావాలంటే ఆ పరిస్థితులు అన్నీ అనుకూలంగానే ఉన్నాయా అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే పాదయాత్ర అనేది రకరకాలుగా ఉంటుంది. షో కోసం చేయడం.. కమిట్మెంట్ తో చేయడం.. లేదా వ్యూహాత్మకంగా చేసి దాన్ని విజయవంతం చేసుకోవడం. ఇలా ఏ పాదయాత్ర విజయవంతం అవ్వాలన్నా క్యాడర్ అనేది కలిసి చావాల్సిందే.. క్యాడర్ లో ఉత్సాహం అనేది నింపాల్సిందే. మరి నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధపడితే , ఆ పాదయాత్ర అసలు ఆ పార్టీ నాయకులలోనే ఉత్సాహాన్నిస్తుందా.. వాళ్ల నాయకులే దీనిలో పాల్గొని విజయవంతం చేస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

లోకేష్ నాయకత్వం పై ఎంతమందికి నమ్మకం

కారణమేంటి అంటే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నుండి నిన్నమొన్నటి వరకు కూడా అంటే తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు నాయుడుగారు వెళ్ళినప్పుడు కూడా సొంత పార్టీ క్యాడర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలి.. వస్తేనే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అని జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్ లు, ప్లకార్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చి తెలుగుదేశం పార్టీలో నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో డిమాండ్ చేశారు.

అదే సమయంలోనే తెలుగుదేశం పార్టీ నుండి చాలామంది నాయకులు కూడా నారా లోకేశ్ నాయకత్వం మీద నమ్మకం లేదు అని వాళ్ళ మాటల ద్వారా అర్ధమవుతోంది. తాజాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా పార్టీ అధినాయకత్వం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు యువ నాయకత్వం పార్టీలోకి రావాలి అని చెప్పి ఆయన కూడా డైరెక్టుగానే అన్నారు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ అయినా.. మరీ ముఖ్యంగా నారా లోకేష్ అయినా ఏదైనా పార్టీ కార్యక్రమాలకు పిలుపిస్తే పార్టీ నాయకులు అందరూ కదిలి రావడం లేదు. కొందరు మాత్రమే హాజరవుతున్నారు. ( Gorantla Butchaiah Chowdary )

ఒక వేళ నారా లోకేశ్ కి నాయకత్వం బాధ్యతలు అప్పగించి డైరెక్టుగా తెలుగుదేశం పార్టీ అగ్రపీఠం పై కూర్చోబెడితే ఎంత మంది కలిసి ఉంటారు.. ఎంతమంది జారిపోతారు అన్న అభద్రతా భావంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అయినా కూడా లోకేష్ ని నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడం కోసం చంద్రబాబు వెనకుండి లోకేష్ ను ముందుకు నడిపిస్తూ చాలా కార్యక్రమాలు చేస్తున్నప్పటికి ఎటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ లోకేష్ వైపు నుండి కనిపించడం లేదు. దానికి చాలా కారణాలు వున్నాయి.

స్వతహాగా మాట్లాడగలిగినప్పుడే

లోకేష్ బాడీ లాంగ్వేజ్ అయినా.. తను మాటలైనా .. అసందర్భమైన ఆవేశమైన.. అవసరం లేని డైలాగులైనా.. ఇవన్నీ మార్చుకుని, తన బాడీ లాంగ్వేజ్ మార్చుకుని తనని తానూ ప్రొజెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళితే సక్సెస్ అవుతాడు. అంతే కానీ ఎవరో చెప్పారని.. ఎవరో రాసిచ్చిన డైలాగ్ లను చదివి వినిపిస్తే ఎప్పటికీ ముందుకు వెళ్లలేని పరిస్థితే ఎదురవుతుంది. ఇప్పటివరకైతే తన వాక్ చాతుర్యంలో గానీ, సమయస్ఫూర్తితో గానీ, క్యాడర్ లో ఉత్సాహం నింపడంలో గానీ వెనుకబడే ఉన్నారనే చెప్పాలి. ఇలాంటప్పుడు పాదయాత్ర పేరుతొ ప్రజలలోకి వెళితే .. క్యాడర్ సహకరించకపోతే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు జరిగిన డామేజ్ కంటే పెద్ద డామేజ్ జరిగే ప్రమాదముంది.

ఇటు లోకేష్ ని అటు జగన్ తోనో లేక కెసిఆర్ తనయుడు కేటీఆర్ తోనో పోల్చుతూ ప్రొజెక్ట్ చేయాలని కొందరు భావించినా కూడా వారు సాధించిన విజయాలలో ఏ ఒక్కటీ కూడా లోకేష్ నిరూపించుకోలేక పోయారు. అందుకే లోకేష్ ను వాళ్ళ పార్టీ క్యాడర్ కూడా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. తానూ ఒక నాయకుడిగా ప్రొజెక్ట్ అవ్వాలి అంటే ముందుగా తానూ నాయకుడినని నిరూపించుకోవాలి. అందుకు ఏవైనా ఒక ఎన్నికలను బాధ్యతగా తీసుకొని, వాటికి తానే వ్యూహాలను రచించి, అందులో పాజిటివ్ రిజల్ట్ గనుక వస్తే.. అది లోకేష్ కష్టంతోనే ఆ రిజల్ట్ వచ్చిందని క్యాడర్ గనుక భావిస్తే అప్పుడు నాయకుడిగా ఒక గుర్తింపు వస్తది.

YS Jagan Padayatra
YS Jagan Padayatra

ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి గారితో పోలిక లేదు గానీ.. తన పాదయాత్రతో ఎన్నో కష్టాలను , ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ప్రజాక్షేత్రంలో వుండి ఒక ప్రజా నాయకుడిగానే కాకుండా అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రిగా గెలుపొందారు. ఇప్పటి వరకు లోకేష్ తననితాను నిరూపించుకున్న ఎన్నికలు గానీ.. సందర్భం గానీ ఏమీ లేవు. ముందు తాను ఒక గుర్తింపు తెచ్చుకొని, తన క్యాడర్ లో ఒక నమ్మకాన్ని కలిగించినపుడు ఎలాంటి పాదయాత్రలు చేసినా దానికి ఒక ప్రయోజనం ఉండొచ్చు. మరి లోకేష్ తాను ఒక నాయకుడినని నిరూపించుకుంటాడా.. లేక వారి సొంత మీడియాలో నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటాడా చూడాలి.

More Latest telugu news todayOnline telugu news todayPolitical newsonline news today