ప్రశాంత్ కిషోర్ అంత మాట అన్నాడా నారా లోకేష్ ..!

2019 ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన టిడిపి అధినేత నారా చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇంత వరకు ఇలాంటి దారుణ ఓటమిని చవిచూసింది లేదు. టిడిపి పార్టీ గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే పరిమితమై భారీగా ఓట్ల శాతాన్ని కూడా కోల్పోయింది.

దీంతో టిడిపి పనైపోయిందని భావించి చాలామంది నాయకులు ఆ పార్టీని వీడి అధికార వైసీపీ పార్టీలో చేరారు. మరి కొందరికి చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం లేక ఎన్టీఆర్ ని పార్టీలోకి ఆహ్వానించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా వైసిపి విజయం సాధిస్తుందని కొందరు టిడిపి నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా చూపిస్తున్నారు.

కరోనా వంటి కష్ట సమయంలో ప్రజలకు అండగా వుండాల్సింది పోయి.. హైదరాబాద్లో జూమ్ మీటింగ్ లతో కాలక్షేపం చేస్తున్నారు టిడిపి అధినేత. ఆ కారణంగా ప్రజల్లో టిడిపి పార్టీ మీద రోజురోజుకు నమ్మకం సన్నగిల్లుతోందనే చెప్పాలి. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యామ్నాయంలో భాగంగా బీజేపీని మచ్చిక చేసే పనిలో పడ్డారు. సందు దొరికినప్పుడల్లా ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ( సోనూసూద్ తో పోటీ )

నారా వ్యూహాలు బెడిసి కొడుతున్నాయా

ఈ చంద్రబాబు జిమ్మిక్కులు కనిపెట్టిన బిజెపి నాయకులు.. చంద్రబాబును కనీసం దగ్గరకు కూడా రానివ్వడం లేదు. బీజేపీ ఆలోచన ఎలా వున్నా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, బీజేపీ, జనసేనతో కలిసే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే జగన్ ను ఓడించాలంటే తన ఒక్కడి వల్ల కాదని చంద్రబాబుకు సైతం తెలుసు. అందుకే బిజెపి, జనసేనతో జత కట్టడానికి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

దీనిలో భాగంగానే నారా లోకేష్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కలిశారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి వ్యూహకర్తగా పని చేయాలని నారా లోకేష్ ప్రశాంత్ కిషోర్ ను కోరారని సమాచారం. గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పని చేసిన విషయం అందరికీ తెలుసు. ఆ ఎన్నికల్లో జగన్ విజయానికి ప్రశాంత్ కిషోర్ ఐడియాలు బాగానే వర్క్ అవుట్ అయ్యాయి కూడా. తర్వాత మరికొన్ని పార్టీలకూ వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్.

అయితే ఇటీవలే ప్రశాంత్ కిషోర్ తాను ఏ పార్టీ కూడా వ్యూహకర్తగా వ్యవహరించబోనని ప్రకటించారు. అయితే తమ పార్టీ తరపున వ్యూహకర్తగా పనిచేయాలని.. అందుకు మీకు కావాల్సిన ప్యాకేజీ ఇస్తామని కూడా నారా లోకేష్ ఆఫర్ చేసినట్లు సమాచారం. దానికి సమాధానంగా తాను ఎటువంటి రాజకీయ పార్టీలకు పనిచేయని.. ముఖ్యంగా జగన్ కు వ్యతిరేకంగా అస్సలు పని చేయనని కరాఖండిగా చెప్పేశారట ప్రశాంత్ కిషోర్. ఇక చేసేదేమిలేక నిరాశతో వెనుదిరిగారట నారా లోకేష్. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను ఓడించడానికి వున్న అన్ని ప్రయత్నాలను పరిశీలిస్తున్నారు చంద్రబాబు అండ్ టీం.

Leave a Comment