అంతా నేనే అనుకుంటే ఇలాగే ఉంటది మరి..

తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడూ లేని విధంగా డిఫెన్స్ లో పడినట్లుగా తెలుస్తుంది. చంద్రబాబు మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలియదు గానీ వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఓల్డ్ ఏజ్ లో మానసిక పరిస్థితి కూడా కొంత ఆందోళన కరంగా ఉంటుంది అన్నది మాత్రం అందరూ గ్రహిస్తున్న విషయం.

పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. తన పార్టీలోకి వచ్చే నేతలను కాదనకుండానే రాజీనామా పద్ధతి ముందుగా పెడుతున్నారు. అయితే ఆ వచ్చే నేతలు రాజీనామాకు పెద్దగా ఇష్టపడకపోయినా, తమ కుటుంబ సభ్యులను చేర్చి చాలా సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే జగన్ కు అవసరం లేకున్నా టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను తన చెంతకు చేసుకున్నారు. అయితే గతంలో చంద్రబాబు చేసిన విధంగా కాకుండా ప్రజలు గమనిస్తున్నారన్న అంశం పరిగణలోకి తీసుకొని ఎంతో పారదర్శకంగా ఆయన ఆ నేతలను తన పార్టీలోకి చేర్చుకునే విధానం చూసి, ప్రజలు కొత్త తరహా రాజకీయం చేస్తున్న జగన్ ను మాత్రం పొగడకుండా ఉండలేక పోతున్నారు.

మరికొందరు అదే బాటలో

ఇక ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని బాగా టాక్ వినపడుతుంది. ఉత్తరాంధ్రలో ఇద్దరు నేతలు వైసీపీలోకి రావడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చేరికలు టిడిపిని, చంద్రబాబును చాలా వరకు డీలా పడేస్తాయని చాలామంది అంటున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల చేరికతో సగం క్రుంగిపోయిన చంద్రబాబు ఇక ఈ చేరికలతో మరింత కుంగిపోతారు అని కూడా చెబుతున్నారు. కానీ వీరి చేరిక స్వయంగా వద్దని అంటున్నారట జగన్.

వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రెడీ అవుతున్నాయి. ఆ కారణంగానే వీరు ఇప్పటికిప్పుడు పార్టీలో తీసుకునేందుకు వైఎస్ జగన్ గారు సిద్ధంగా లేరని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ఒక రోజు ముందుగా వీరిని చేర్చుకొని తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ తీయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మరి జగన్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

వలసల కొనసాగింపు

ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీలో వలసలు మాత్రం అస్సలు ఆగడం లేదని చెప్పాలి. ఒక్కో కీలక నేత చేజారి పోతూ ఉండటం ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఎప్పుడు ఏ నాయకుడు ఉంటాడు ఏ నాయకుడు పార్టీని వీడి బయటకు వెళ్ళిపోతాడు అన్న భయం బాబులో కనబడుతుంది.

తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వెళ్లిపోయే వారి లిస్టు రోజురోజుకు పెరిగి పోతుండటంతో చంద్రబాబు సైతం ఆందోళన చెందటం సహజం అయిపోయింది ఇప్పుడు. అయితే ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు జగన్ కు జై కొట్టగా , మరికొంతమంది ఎమ్మెల్యేలు ఆ బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నారనే సమాచారం కూడా బాబుకు నిద్ర పట్టడం లేదట.

ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో ఉంటూనే లోపాయికారీగా జగన్ కు జై కొట్టడం , కీలకమైన సమయంలో జంప్ చేసేందుకు ప్లాన్ చేసుకోవడం వంటి వ్యవహారాలు చంద్రబాబు చూస్తూనే వున్నారు. కానీ ఆ విషయాలను బయటపెడితే ఇప్పటి నుంచే పార్టీని వీడే వారి సంఖ్య భారీగా పెరుగుతుందన్న భయంతో ఆయన సైలెంట్ గా ఉంటూ, పార్టీ మారుతారు అనుకున్న నాయకులను బుజ్జగించే పనిలో ఉన్నారు.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో అనుబంధంగా కొనసాగుతారన్న ఎమ్మెల్యేలలో విశాఖ టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు బలంగా కనబడుతున్నాయి. ఇప్పటికే వాసుపల్లి గణేష్ జగన్ కు జై కొట్టేయగా , మరికొద్దిరోజుల్లో ఎమ్మెల్యే గణబాబు సిద్ధమవుతున్నారు.

గంటా ఎటువైపో

అలాగే గంటా శ్రీనివాసరావు వైసిపి లేదా బీజేపీలోకి వెళ్లేందుకు ఎప్పటినుంచో ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయన మనసంతా వైసీపీ పై ఉన్నా అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఎప్పటికప్పుడు చేరికకు బ్రేక్ పడుతూ వస్తుంది. మరో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఒక్కడే తెలుగుదేశం పార్టీ తరఫున ఆక్టివ్ గా కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో టిడిపి తరఫున యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు.

విశాఖ జిల్లా నుంచి చూసుకుంటే సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ మధ్యకాలంలో కాస్త యాక్టీవ్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం పై పదేపదే విమర్శిస్తూ ఆ పార్టీకి అండగా నిలుస్తున్నారనే చెప్పాలి.

ఆయన విశాఖ వాసి అయినా కూడా అమరావతికి జై కొట్టారు. గతంలో ఈయన వ్యవహారశైలిపై నారా చంద్రబాబు నాయుడుకు పెద్దగా నమ్మకం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం విశాఖలో ఆయన మాత్రమే పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నాడు. వెలగపూడి రామకృష్ణబాబు వైసీపీలో చేరే అవకాశం లేదనే నమ్మకంతో చంద్రబాబు చాలా నమ్మకంగా ఉన్నారు.

ఇక మిగతా జిల్లాల విషయానికి వస్తే ఇక్కడ ఎవరిపైనా పెద్దగా నమ్మకం లేదు. ఇప్పుడు కాకపోతే మరి కొద్ది రోజులు అయినా సరే పార్టీ మారే అవకాశం లేకపోలేదని అనుమానంతో చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా అందరి పైన నిఘా వేసి అనుమానం ఉన్న నాయకులను సైతం బుజ్జగించే పనిలో చంద్రబాబు నిమగ్నమైపోయారట. ఏది ఏమైనా 40ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబుకు ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటి. ఎప్పుడో చిన్న చిన్న నాయకులను సైతం బుజ్జగించాల్సి వస్తుంది.

ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్లని చంద్రబాబు, ఇప్పుడు బుజ్జగించే కార్యక్రమం పెట్టుకున్నారు. అంటే పాలన ఆయన చేతిలో ఉన్నప్పుడు సరిగ్గా ఉంటే ఇప్పుడు ఈ గతి వచ్చేదా చెప్పండి. పాలనలో ఉన్నప్పుడు నాకన్నా మొగోడు లేదన్నట్టు ముందుకెళ్లాడు. ఇప్పుడు అవన్నీ చేతులు విరిగేసరికి, ఆకులు పట్టుకోవాల్సి వచ్చింది. ఏదైనా కాలం మరిన్ని నేర్పిస్తుంది మనకు , దానికి తగ్గట్టు నేర్చుకుని ముందుకు వెళ్లాల్సిందే..

Leave a Comment