నాని మూ’వీ’ .. అమెజాన్ ప్రైమ్ లో ..

Nani V

నాని మరియు సుధీర్ ప్రధాన పాత్రధారులుగా నటించిన సినిమా ‘ వి ‘. ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. శ్రీ వెంకటేశ్వరా ప్రొడక్షన్ లో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో నివేతా థామస్ , అదితిరావు హీరోయిన్లుగా నటించారు. ( సెప్టెంబర్ 2న టీజర్.. )

ఎప్పుడో ఉగాదికి రిలీస్ కావాల్సింది ఈ కరోనా వాళ్ళ వాయిదా పడింది. ఈ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో థియేటర్లు తెరిచే పరిస్థితి ఇప్పట్లో కనపడట్లేదు. అందువల్ల ‘వి’ సినిమా ను సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలనీ నిర్ణయించుకున్నారు.

ఈ మూవీని థియేటర్ లోనే విడుదల చేయాలనీ దిల్ రాజు భావించినప్పటికీ కరోనా తీవ్రత వల్ల ఓటిటి కి మొగ్గు చూపారు. సినిమా ఖర్చు 25 కోట్లు అయితే అమెజాన్ 33 కోట్ల ఆఫర్ ఇచ్చిందట. అందుకే దిల్ రాజు కూడా ఒకే అన్నాడని తెలుస్తుంది.

Leave a Comment