తన పుట్టిన రోజున ఈ కోరిక తీర్చాలి అంటున్న అక్కినేని నాగార్జున..

ఇవాళ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు. తన సినిమా కెరియర్ 31 సంవత్సరాలు పూర్తిచేసుకున్నాడు. నిన్నటి నుంచి ఎంతోమంది విషెస్, ప్రేమ, అభిమానంతో మెసేజెస్ పంపుతున్నారని అందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ( బిగ్ బాస్ 4.. )

ఈ సందర్భంగా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉందని, అయిదున్నర నెలల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు బిగ్ బాస్ సీజన్ 4తో రాబోతున్నానని తెలిపారు. బిగ్ బాస్ సీజన్ 3లో తన అభిమానులు తనపై ఎంతో ప్రేమ అభిమానం చూపించారని , ఇప్పుడు మళ్ళీ ఈ సీజన్ 4 కూడా అలాగే మీరు మీ ప్రేమ అభిమానం, బ్లెస్సింగ్ తో సక్సెస్ చేయాలని నా కోరిక అని అన్నారు. ఈ నా కోరిక మీరు తప్పక తీరుస్తారు అని ఆశిస్తున్నానని అభిమానులకు తన మెసేజ్ పంపారు.

Leave a Comment