నాకేం బాధ బ్రదర్.. నవదీప్.. !!

సుశాంత్ సింగ్ మరణం డ్రగ్స్ తో ముడిపడిందని ఎన్ బిసి తేల్చడంతో పాటు రియా చక్రవర్తిని మరియు ఆమె సోదరుడిని కూడా అరెస్ట్ చేసారు. దీంతో బాలీవుడ్ పరిశ్రమలో డ్రగ్స్ అంశం హాట్ టాపిక్ గ మారింది. విచారణలో రియా కొంత మంది ప్రముఖుల పేర్లను కూడా చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అందులో ప్రముఖంగా రకుల్ ప్రీత్ సింగ్, ముఖేష్ చబ్రా మరియు సారా అలీఖాన్ పేర్లను బయట పెట్టినట్టు కధనాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు రియా , రకుల్ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం విశేషం. ట్విట్టర్ లో Rakulpreetsingh అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ లో వుంది. ( సుశాంత్ కేసులో రియా అరెస్ట్ ..! )

ఇటువంటి తరుణంలో ఒక తెలుగు ఇండస్ట్రీ అభిమాని ‘ నవదీప్ అన్న మనకి ఈ బాధలు తప్పేలా లేవు, కొంచెం జాగ్రత్త ‘ అని ఈ డ్రగ్స్ అంశాన్ని ఉద్దేశిస్తూ వెటకారంగా సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీనికి స్పందిస్తూ సమాధానంగా నవదీప్ ‘నాకు ఏం బాధ లేదు బ్రదర్.. నువ్వు బాధ పడకు.. ఏదైనా పనికొచ్చే పని చేద్దాం’ అని రిప్లయ్ ఇచ్చారు.

Leave a Comment