టిడిపి సీనియర్ నేత మాజీ ఎంపీ మురళీమోహన్ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నారు. ఇక నుంచి టీడీపీ తరఫున కానీ.. మరే పార్టీ తరఫున గానీ పోటీ చేసేది లేదని సన్నిహితులు వద్ద అన్నట్టుగా సమాచారం. దీంతో విషయం తెలుసుకున్న టీడీపీ అధిష్టానం ఆయన వద్దకు ఒక బృందాన్ని పంపింది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో పాటు టిడి జనార్దన్ బృందం మాజీ ఎంపీ మురళీమోహన్ తో చర్చలు జరిపారు. ( Gorantla Butchaiah Chowdary )
అయితే టిడిపి బృందం చర్చలు సఫలం కాలేదని తెలుస్తోంది. అంతేకాదు రాజమండ్రి సీట్ ఇవ్వకపోతే తమ కుటుంబం కూడా టీడీపీకి దూరంగా ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. 2014లో రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన మురళీమోహన్.. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. తన వారసురాలిగా మాగంటి రూపను బరిలోకి దించారు. ఆమె వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ చేతిలో ఓడిపోయారు. దాంతో అప్పటినుంచి ఈ కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంటూ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటోంది.
టీడీపీపై అసంతృప్తిగా ఉన్న మాజీ ఎంపీ మురళీమోహన్
తాజాగా రాజమండ్రి పార్లమెంటు ఇన్ఛార్జిగా మురళీమోహన్ ఉండాలని టీడీపీ ఆయనను కోరగా.. తాను ఉండనని నా బదులు మాగంటి రూప ఉంటారని చెప్పారట. అయితే వైసీపీని ఎదుర్కోవాలంటే మీరే ఇంచార్జ్ గా ఉండాలని కోరారట. దానికి ఆయన తన ఆరోగ్యం దృష్ట్యా ఈ పదవిలో కొనసాగలేనని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో విద్యావంతురాలైన ముళ్లపూడి రేణుకను టిడిపి అధిష్ఠానం సంప్రదించిందట. వచ్చే ఎన్నికల్లో ముళ్లపూడి రేణుకను బరిలోకి దింపాలని టీడీపీ భావిస్తోంది.
- దేశం మొత్తానికి గంజాయి సరఫరా చేసిన క్రెడిట్ మాదే.. గంటా శ్రీనివాస్
- బోండా ఉమాపై అందుకే కేసు నమోదు చేయలేదేమో.. !
- సిఐ నాయక్ పై దాడి.. నారా లోకేష్ పై హత్యాయత్నం కేసు
- జనసేన పార్టీ అధ్యక్షుడిని వెంటాడుతున్న నవతరం పార్టీ
- పోలీసుల ఎంట్రీతో నీళ్లునమిలిన నక్కా ఆనందబాబు..!
ప్రస్తుతానికి ముళ్లపూడి రేణుక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి అంత సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అధిష్టానం వైఖరిని గమనిస్తున్న మురళీమోహన్ తన సన్నిహితుల వద్ద అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు.. దశాబ్దాలుగా టీడీపీతో ఉంటున్న తమ వారిని కాదని వేరే వాళ్ళకి ఇన్చార్జిగా చేయడం కరెక్ట్ కాదని వాపోయారట. ఏదిఏమైనా ఎంపీ సీట్ చేజారిందన్న బాధ మురళీమోహన్ లో ఉంది కాబట్టే టిడిపికి దూరంగా జరిగినట్లు అర్థమవుతోంది.
More Latest Update : latest political news today online political news ap news
1 thought on “మాజీ ఎంపీ మురళీమోహన్ టీడీపీని వీడటానికి ఆమెనే కారణమా.. ?”