కరోనా మూడో వేవ్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మనకు మరో ముప్పు పొంచి వుందా.. ? అంటే అవుననే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మంకీపాక్స్… యూకే లో తాజాగా వెలుగు చూసిన ఒక వైరస్. యూకే లోని నార్త్ వేల్స్ లో మంకీపాక్స్ లక్షణాలతో రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరు ఆరోగ్య అధికారుల పర్యవేక్షణలో వున్నారు. ( క్లినికల్ ట్రయల్స్ )
ఇది ఎక్కడినుంచి వీరికి వ్యాపించింది, ఇంకా ఎవరైనా ఈ వ్యాధి సోకివుండవచ్చా అని ఆ రోగులను పర్యవేక్షిస్తున్నారు. ఇది అంత ప్రమాదకరమైన వైరస్ కాదని..ఆరోగ్యంగా వుండే వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం తక్కువనీ.. కానీ జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో మరికొంత మంది ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మంకీపాక్స్ అంత ప్రమాదకరమా
మంకీపాక్స్ అనేది ఒక జూనోటిక్ వైరల్ వ్యాధి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) చెబుతోంది. చాలావరకు మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని వర్షారణ్యాలలో ఈ కేసులు కనపడతాయని.. ఇది వైరస్ సోకిన జంతువుల నుండి మానవులకు సోకుతుంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, మంకీపాక్స్ వైరస్ మశూచి సమూహానికి చెందినదని .. జంతువుల యొక్క రక్తం, చెమట ద్వారా వైరస్ మానవులకు వ్యాపిస్తుంది. ( జూనోటిక్ వైరల్ వ్యాధి )
ఏమాత్రం నిర్లక్ష్యంగా వున్నా
మశూచి మాదిరిగానే మంకీపాక్స్ యొక్క లక్షణాలు ఉంటాయి. ఏమాత్రం కండరాల నొప్పులు, జ్వరం, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు మరియు బొబ్బలు ఏర్పడితే అప్రమత్తంగా ఉండాలి. ఈ వైరస్ సోకిన ఐదు రోజులకు చర్మంపై దద్దుర్లు కనపడుతాయి. ముఖం నుండి మొదలై శరీరంలోని అన్ని భాగాలకు వ్యాపిస్తుంది. చివరకు బొబ్బలుగా మారి ఇన్ఫెక్షన్ కి గురవుతారు. డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ప్రకారం మంకీపాక్స్ సోకిన వారిలో మరణించే శాతం తక్కువగానే ఉందని అంటున్నారు. మశూచికి వాడిన టీకాలనే దీనికి వాడుతున్నట్టు చెప్పారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …