దేహసం కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే.. మోదీ ..!!

ఈ దేశం బాగుపడాలంటే పాత బ్రిటిష్ కాలం నాటి చట్టాలు సంస్కరింపబడాలి. సవరణలు జరగాలి. అవసరం కానివి, అనవసరమైనవి రద్దవాలి. కఠినమైన కూడా దేశం కోసం నిర్ణయం తీసుకోవాల్సి వస్తే వెనకడుగు వేయకూడదు.

ఇది భారత ప్రధాని మోడీ ప్రధానంగా వ్యవహరించే విధానం. మోడీ తన ప్రతి స్పీచ్ లోను తరచుగా చెప్పే అద్భుతమైన మాటలివి. తాజాగా అసోసియేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక వారోత్సవాల ఉద్దేశించి వర్చ్యువల్ విధానంలో ప్రసంగించిన మోడీ.. అటువంటి మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ వర్చ్యువల్ సమావేశంలో మోదీ మాట్లాడుతూ అంతర్జాతీయంగా భారతదేశం భవిష్యత్తులో నిర్వహించబోయే పాత్ర చాలా కీలకమైనదని వ్యాఖ్యానించారు. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు ముందు భారతదేశం ఎందుకు అన్న ప్రశ్న ఉదయిస్తే.. ఇప్పుడు భారతదేశం ఎందుకు కాదు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమవుతోంది అంటూ పేర్కొన్నారు.

ఇన్వెస్టర్ల మైండ్ సెట్ వై ఇండియా నుంచి వై నాట్ ఇండియాగా మారిపోయిందన్నారు మోదీ. వచ్చే 27 సంవత్సరాలు భారత దేశానికి అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.

దేశంలోని ఆర్థిక సంస్కరణలు చూసి ఇతర దేశాలు సైతం మన దేశం వైపు ఆసక్తి చూపిస్తున్నారని మోడీ పేర్కొన్నారు. కరోనా సమయంలో కూడా ఆర్థిక సంస్కరణలో ది బెస్ట్ గా దేశాన్ని ముందుకు నడిపించామని, ఆ సమయంలో కూడా రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు సాధించగలిగామని పేర్కొన్నారు.

6 నెలల క్రితం తమ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలు రైతులకు ప్రయోజనం చేకూర్చడం ప్రారంభించాయని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో భారతదేశంలో పెట్టుబడి పెట్టడం ఎందుకు అని ప్రశ్నించిన పెట్టుబడిదారులు.. ఆరు సంవత్సరాలుగా భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారు అని మోదీ చెప్పారు.

1500 వరకు పాత మరియు వాడుకలో లేని చట్టాలను రద్దు చేశామన్నారు.
మారుతున్న పెట్టుబడి ప్రమాణాలకు అనుగుణంగా కొత్త చట్టాలను రూపొందిస్తున్నామని మోడీ పేర్కొన్నారు.

గతంలో పెట్టుబడులు పెట్టే వారికి రెడ్ టేప్ ఉండేదని.. కానీ ఇప్పుడు పెట్టుబడి పెట్టే వారికి రెడ్ కార్పెట్ పరుస్తున్నామని మోడీ చెప్పారు. స్తార్ట ప్లను ప్రోత్సహిస్తున్నామన్నారు.

ఇంతకుముందు పారిశ్రామిక విధానంలో ప్రభుత్వ జోక్యం చాలా ఉండేది. పెట్టుబడిదారులు భారతదేశం ఎందుకు వచ్చామా అని ఇబ్బంది పడే వాళ్ళని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రైవేటు రంగం పై ప్రభుత్వం చూపిన ప్రోత్సాహకాల వల్ల భారత దేశానికి ఇప్పుడు కలిసి వచ్చేలా అవుతోందని.. కొత్త భారత దేశం ఆత్మనిర్భర్ భారత్ వైపు దూసుకుపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

దేశీయ సామర్ధ్యాలు, తయారీ మరియు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని చెప్పారు. భారతదేశాన్ని స్వావలంబన చేయడానికి ప్రయత్నాలు చేయాలని ప్రధాని పారిశ్రామికవర్గాలకు పిలుపునిచ్చారు. ప్రపంచం భారత ఆర్థిక వ్యవస్థను విశ్వసిస్తుందన్నారు.

రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని.. ప్రైవేటు రంగంలో కూడా పెట్టుబడులను పెంచాలని ఆయన చెప్పారు. R&D లో పెట్టుబడులు పెంచాల్సిన అవసరం చాలా ఉంది. యుఎస్ లో R&D లో 70 శాతం పెట్టుబడులు ప్రైవేటు రంగం పెట్టిందని చెప్పారు.

ఈరోజు R&D లో పెట్టుబడుల ప్రైవేటురంగ వాటాను కూడా పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచ సరఫరా గొలుసులో డిమాండ్ ఏదైనాసరే భారత్ తీర్చేలా అభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Leave a Comment