భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ 100 రూపాయల నాణాన్ని విడుదల చేశారు. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన విజయరాజే సింధియా శతజయంతి సందర్భంగా స్మారక నాణాన్ని ప్రధాని మోదీ ఒక వర్చ్యువల్ కార్యక్రమంలో భాగంగా విడుదల చేశారు.
రాజ్ సత్తా కన్నా జన్ సత్తా ముఖ్యమని రాజమాత నిరూపించారని ప్రధాని మోడీ అన్నారు. అంటే అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకోవడం కంటే ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం అని అర్థం. స్వాతంత్య్ర పోరాటం నుంచి స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దాల వరకు ముఖ్య రాజకీయ ఘటనలకు రాజమాత సాక్షిగా నిలిచారని మోదీ అన్నారు.
గత 60 ఏళ్లలో భారత దేశానికి ఓ దిశను చూపించిన ప్రముఖ రాజకీయ వేత్తలలో రాజమాత కూడా ఒకరు అని చెప్పారు. ఆమె నిర్ణయాత్మక నాయకురాలని మోడీ అన్నారు. స్వాతంత్య్రానికి ముందు విదేశీ దుస్తులను కాల్చడం మొదలు కొని.. రామమందిరం ఆందోళన వరకు కూడా ఆమె అనుభవం గొప్పది అని గుర్తుచేసుకున్నారు. రామజన్మభూమి కోసం ఆమె చాలా కష్టపడ్డారని.. ఆమె శతజయంతి వేళ ఆ కల సాకారం కావడం సంతోషంగా ఉందన్నారు మోదీ.
విజయరాజే సింధియా రాజవంశానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ చాలా సంవత్సరాలు జైలులో గడిపారు. ఎమర్జెన్సీ కాలంలో ఆమె తన కూతుళ్లకు జైలు నుంచే లేఖను రాశారు. తాను ప్రస్తుతం చేస్తున్న పోరాటం, త్యాగం భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తు తరాల కోసం ఆమె తన సుఖాన్ని విడిచిపెట్టారు.
ఇక ఈ ఏడాది ఆరంభంలో విజయరాజే సింధియా మనవడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్తో దశాబ్దాల బంధాన్ని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. జ్యోతిరాదిత్య సింధియా జాతి ప్రయోజనాల కోసం బీజేపీలో చేరారని విజయరాజే సింధియా కుమార్తె, జ్యోతిరాదిత్య సింధియా అత్త ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి యశోధర రాజే పేర్కొనడం గమనార్హం.
మొత్తంగా పార్టీ సీనియర్ నేతలను గుర్తుచేసుకోవడం.. తరువాతి తరం కార్యకర్తలకు వారిని ప్రేరణగా నిలపడం.. వారికి సముచిత గౌరవ స్థానం ఇవ్వడంలో బీజేపీ ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా దేశ సేవకు తమ జీవితాలను అంకితం చేసిన ఎందరో ప్రముఖులను తమ పాలనా కాలంలో గుర్తించి, గౌరవించే ఘనత బిజెపి సొంతం అంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …