ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష పదవికి భారత్

ప్రధాని మోదీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ప్రధానిగా నిలిపోనున్నారు. ఆగస్టు నెలలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష పదవిని భారత్ చేపట్టనుంది. ఈ పదవీ కాలంలో భారత్ మూడు అత్యున్నత స్థాయి సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు మోదీ ( Narendra Modi ) అధ్యక్షత వహిస్తారు.

ఐక్యరాజ్య సమితి లో భారత్ ప్రధాన ఎజెండా

మరోవైపు విధుల నిర్వహణలో భారత్ కు సంపూర్ణ మద్దతు అందిస్తామని రష్యా, ఫ్రాన్స్ ప్రకటించాయి. భారత ఎజెండా స్ఫూర్తిదాయకంగా ఉందని చెబుతూ రష్యా అభినందించింది. ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరాటం, శాంతి స్థాపన, సముద్ర తీర భద్రతా తదితర ప్రపంచ అంశాలను భారత ఎజెండాలో చేర్చడాన్ని రష్యా ప్రముఖంగా ప్రస్తావించింది. “అధ్యక్ష పీఠాన్ని చేపడుతున్న భారత్ కు అభినందనలు.. భారత ఎజెండా చాలా బాగుంది.. ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరాటం, శాంతి స్థాపన, సముద్ర తీర భద్రతా తదితర ప్రపంచ అంశాలకు సముచితం స్థానం కల్పించారు.. సమర్ధంగా మంచి ఫలితాలను ఇచ్చే దిశగా భారత్ కృషి చేస్తుందని ఆశిస్తున్నా” అని భారత్ లోని రష్యా రాయబారి Nikolay Kudashev ట్వీట్ చేశారు.

రష్యా, ఫ్రాన్స్ మద్దతు

అదేవిధంగా ఫ్రాన్స్ కూడా భారత్ కు అభినందనలు తెలిపింది. ఉగ్రవాదంపై పోరాటం, శాంతి స్థాపన, సముద్ర తీర భద్రత తదితర వ్యూహాత్మక అంశాలపై భారత్ తో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. “ఫ్రాన్స్ తర్వాత ఈ పదవిని భారత చేపట్టడం సంతోషంగా ఉంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులలో భారత్ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని” భారత్ లోని ఫ్రాన్స్ రాయబారి Emmanuel Lenain ట్వీట్ చేశారు. ( UNESCO )

ప్రపంచానికి అవసరమయ్యే పలు కీలకమైనటువంటి విషయాలు దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వర్తిస్తామని ఐరాసలో భారత రాయబారి TS Tirumurti ట్విట్టర్ వేదికగా ఓ వీడియోలో వెల్లడించారు. “ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఇకపై కూడా ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుంది” అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పదవిని చేపట్టడంలో చేసిన కృషికి గాను ఫ్రాన్స్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఐక్యరాజ్య సమితి లో శాశ్వత సభ్యత్వం కోసం

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందే అంటూ Uzbekistan మరోసారి తన మద్దతును ప్రకటించింది. ఐరాసలోని పెద్ద దేశాల్లో భారత్ ఒకటి. ఆగ్నేయాసియా దేశాల్లో భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. కాబట్టి భారత్ కు ఐరాస పర్మినెంటు మెంబెర్ షిప్ ఇవ్వడం చాలా ముఖ్యమని భారత్ లో Uzbekistan రాయబారి Dilshod Akhatov పేర్కొన్నారు.

భారత్ ఇవాళ రొటేషన్ పద్ధతిలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐరాస భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వ హోదాకు తను ఎప్పట్నుంచో మద్దతు తెలుపుతున్నామని.. ఐరాసలో శాశ్వత సభ్యత్వ హోదా లేని దేశాలకు కూడా తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి భారత్ కృషి చేస్తోందని.. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో కూడా భారత్ కీలక పాత్ర పోషిస్తోందని Uzbekistan రాయబారి Dilshod Akhatov వ్యాఖ్యానించడం విశేషం.

3 thoughts on “ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష పదవికి భారత్”

Leave a Comment