దేశంలోని రహదారులపై ఫిట్నెస్ లేని వాహనాలు తిరగకుండా చేయడానికి వెహికల్ స్క్రాపేజి పాలసీ ( Vehicle Scrappage Policy ) దోహద పడుతుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ విధానంతో పర్యావరణ కాలుష్యం తగ్గడంతో పాటుగా.. దాదాపుగా పది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి లభించే ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు.
గుజరాత్ లో జరిగిన పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ఆయన వెహికల్ స్క్రాపేజి పాలసీ ( Vehicle Scrappage Policy ) ని ప్రారంభించారు. వాహనం జీవన కాలాన్ని బట్టి కాకుండా ఫిట్నెస్ సరిగ్గా లేదని తెలిసినా ఆ వాహనాన్ని తుక్కుగానే పరిగణిస్తామని అన్నారు. తుక్కు గా మారిన వాహనాలకు ధ్రువపత్రాలు జారీ చేస్తారని.. దీంతో కొత్త వాహనం కొనుగోలు చేసే సమయంలో రిజిస్ట్రేషన్ రుసుము తీసుకోరని.. వాహన పనులపై కూడా రాయితీ లభిస్తుందని చెప్పారు. ( నిర్దేశిత ప్రయోజనాలకు మాత్రమే eRUPI )
ఫిట్నెస్ సరిగ్గా లేని, కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు వెహికల్ స్క్రాపేజి పాలసీ ( Vehicle Scrappage Policy ) ని తీసుకువచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత బడ్జెట్ లోనే ఈ విధానాన్ని ప్రకటించారు. కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ధ్యేయంగా ఈ పాలసీని తీసుకొచ్చారు. కొత్త వాహనాలతో పోలిస్తే ఫిట్నెస్ లేని కాలం చెల్లిన వాహనాలు 10 నుంచి 12 రెట్లు ఎక్కువగా పర్యావరణాన్ని కలుషితం చేస్తాయని అంచనా వేశారు.
- జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోసం చంద్రబాబు ఆరాటం.. అది సాధ్యమవుతుందా.. ?
- అసెంబ్లీ రద్దు చేయాలంటున్న టీడీపీ.. మరి ముందస్తు ఎన్నికలకు రెడీనా..!
- వినాయకుడు | లోకరక్షకుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు
- నారా లోకేష్ పాదయాత్ర.. నాయకుడిగా సక్సెస్ అవుతాడా.. ?
- బీజేపీ సరికొత్త వ్యూహం.. బెంగాల్ విభజన రాగం..!
దేశీయ వాహనాల చట్టం ప్రకారం వ్యక్తిగత వాహనాల జీవితకాలం 20 సంవత్సరాలు కాగా, వాణిజ్య వాహనాల జీవితకాలం 15 సంవత్సరాలు. అయితే కాలంచెల్లిన దాదాపుగా 51 లక్షల వ్యక్తిగత వాహనాలు, 17 లక్షల వాణిజ్య వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయని అంచనా వుంది. అయితే కాలం చెల్లిన అన్ని వాహనాలు ఈ విధానం కింద తుక్కుగా మార్చరు. నిర్ణీత కాలం ముగిసిన అనంతరం వాహనానికి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్షలో గనుక వాహనం ఫిట్నెస్ మెరుగ్గానే ఉందని తేలితే.. మరో ఐదేళ్ల పాటు చెల్లుబాటు అయ్యేలా రెన్యువల్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఆ వ్యవధి ముగియగానే మళ్లీ ఫిట్నెస్ టెస్ట్ కు హాజరు కావాల్సి ఉంటుంది.
ఒకవేళ వాహన ఫిట్నెస్ మెరుగ్గా లేదని తేలితే తుక్కుగా మారుస్తారు. ఫిట్నెస్ సరిగ్గా లేని వాహనాన్ని తుక్కు కోసం ఇస్తే ఒక ధ్రువపత్రాన్ని జారీ చేస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు ఆ ధ్రువపత్రాన్ని చూపితే, వాహనం ఖరీదులో 4 నుంచి 6 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రోడ్ టాక్స్ లో 25% రిబేట్, ఉచితంగా రిజిస్ట్రేషన్ వంటి సౌకర్యాలు వుండనున్నాయి.
3 thoughts on “Vehicle Scrappage Policy | ఫిట్నెస్ లేని వెహికల్ ఇక తుక్కుకే..!”