ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీని బారిన పడిన మాజీమంత్రి, బీజేపీ నేత పి. మాణిక్యాలరావు (60) కూడా ఈ వైరస్‌తోనే మరణించారు. నెల రోజులుగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు.
అయితే, ఆయన శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన మాణిక్యాలరావు 2014లో తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున గెలిచారు.