జగన్ పై ఆశలు పెట్టుకున్న మమతా బెనర్జీ

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ కేంద్రంగా పలు బిజెపియేతర పార్టీల అధినేతలను కలిశారు. దీంతో దేశ రాజకీయాల్లో ఇది పెద్ద చర్చకు దారితీసింది. 2018 లో థర్డ్ ఫ్రంట్ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ పావులు కదిపారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ యేతర పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న దృఢసంకల్పంతో పలువురు బీజేపీ, కాంగ్రెస్ యేతర పార్టీల నాయకులను స్వయంగా వాళ్ళ రాష్ట్రాలకు వెళ్లి మరీ సీఎం కేసీఆర్ కలిశారు.

అయితే ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ సమయం మమతా బెనర్జీ కూడా ఒకింత వ్యతిరేకతను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లేకుండా ఎలా అనే ప్రశ్న ఆమె లేవనెత్తారు.

ఇప్పుడు మమతా బెనర్జీ వంతు

ఇక తాజాగా మరో ప్రయత్నమే దేశ రాజకీయాల్లో జరుగుతోంది. అయితే ఈసారి బిజెపియేతర పార్టీల అధినేతలతో మమతా సమావేశమవుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశమయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇదిలా ఉంటే సోనియా, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమైన సమయంలో వారంతా వైసీపీ అధినేత జగన్, బిజేడి నేత నవీన్ పట్నాయక్ గురించి ప్రస్తావించినట్లు తెలిపారు. (YCP MPs in Parlament)

మోడీ ప్రభుత్వంకు సరైన సమయంలో జగన్ పార్టీ, నవీన్ పట్నాయక్ పార్టీలు అండగా నిలుస్తున్నట్లుగా తమ మధ్య చర్చకు వచ్చినట్లు తెలిపారు. అయితే వైఎస్ జగన్ తో, నవీన్ పట్నాయక్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని దీదీ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో వీరు కూడా తమతో కలిసి వస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక పార్లమెంటులో వైసిపి ప్లకార్డులతో దర్శనమివ్వడం చూస్తుంటే ఆ పార్టీ కూడా మోదీ సర్కారు క్రమంగా దూరం చేసుకుంటుందా అని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. నితీష్ కుమార్ గురించి ప్రస్తావన రాగానే బీజేపీని వేడితే అప్పుడు ఆలోచిస్తామని వెల్లడించారు దీదీ.

భవిష్యత్తులో మరిన్ని చర్చలు సమావేశాలు జరుగుతాయని, పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాక చర్చల్ని వేగవంతం చేస్తామన్నారు మమతా బెనర్జీ. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈరోజు కాకపోయినా రేపైనా వారంతా తమతో కలిసి వస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రాంతీయ పార్టీలు అంతా ఒకే తాటిపైకి వచ్చేందుకు సమయం చాలానే ఉందని, ఒకసారి ఏకమైయ్యారంటే అది ఒక దళంలా తయారవుతుందని మమతా బెనర్జీ అన్నారు. ఇక ప్రధాని రేసులో తాను నిలుస్తారా అన్న ప్రశ్నకు దీదీ చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. తాను ప్రజా జీవితంలో ఉంటానని, ప్రజల కోసం పని చేస్తానని, అదే కొనసాగిస్తానని చెప్పారు. ఒక నాయకురాలిగా కాకుండా ఒక కార్యకర్తగా పని చేస్తానని చెప్పుకొచ్చారు.

Leave a Comment