లెఫ్ట్ లిబరల్ జర్నలిస్టులు , లెఫ్టు అనుకూల పత్రికలు డబ్బు కోసం ఏమైనా చేస్తాయా.. ఎంతకైనా దిగజారుతాయా.. భారత శత్రువులతో సైతం చేతులు కలుపుతాయా.. భారత్ పై దుష్ప్రచారం చేస్తున్న కమ్యూనిస్టు చైనాకు అనుకూలంగా మనదేశంలోని కొన్ని పత్రికలు, కొంతమంది జర్నలిస్టులు వ్యాసాలు రాయడాన్ని మనం ఏవిధంగా అర్థం చేసుకోవాలి.
ప్రస్తుతం తూర్పు లడఖ్ లోని line of actual Control వద్ద కమ్యూనిస్టు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తో, మన భారత సైనికులు పోరాటానికి సిద్ధమయ్యారు. 2 నెలల క్రితం గాల్వలోయలో చైనా సైన్యంతో జరిగిన పోరాటంలో 21 మంది భారత సైనికులు అమరులయ్యారు.
చైనాతో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా ఆ దేశానికి చెందిన సంస్థలపై కఠిన చర్యలకు దిగింది. చైనా కంపెనీలకు సంబంధించిన యాప్ లను సైతం బ్యాన్ చేసింది. అంతేకాదు చైనాకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మద్దతుగా దేశంలోని ప్రజానీకం సైతం చైనా వస్తువులను కొనేందుకు సైతం ఇష్టపడటం లేదు. అంతే కాదు వీధుల్లోని చైనా మార్కెట్ పేర్లను సైతం మార్చేస్తున్నారు.
ఇది ఎంత వరకు సబబు
ప్రధాని మోదీ నుంచి సామాన్య పౌరుల వరకు అంతా కలిసికట్టుగా చైనాకు వ్యతిరేకంగా ఏకమైతే, మరి మన దేశం లోని సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ మేధావులు, కమ్యూనిస్టు చైనా అనుకూల పత్రికలు, ఇంకా కొంతమంది చైనా అనుకూల వామపక్ష జర్నలిస్టులు ఏం చేస్తున్నారో తెలుసా.. ! భారత్ లోనే ఉంటూ.. భారత దేశపు తిండి తింటూ.. కమ్యూనిస్టు చైనా నియంత జిన్ పింగ్ కు అనుకూలంగా బాకాలు ఊదుతున్నారు. తమ రాతలతో.. తమ కథనాలతో చైనాకు భజన చేస్తున్నారు.
ముఖ్యంగా ది హిందూ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అయితే చైనాకు భజన చేయడంలో అన్నీ హద్దుల్ని చెరిపేసింది. అక్టోబర్ 1 కమ్యూనిస్టు చైనా నేషనల్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హిందూ ఇంగ్లీష్ పత్రిక తన మూడో పేజీలో చైనాను, దాని అధ్యక్షుడు అయినటువంటి జిన్పింగ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. మొత్తం పేజీలో 2020లో చైనా సాధించిన ఘన విజయాలు అంటూ గొప్పగా చెబుతూ ఏకరువు పెట్టింది. ఇవన్నీ కూడా పెయిడ్ ఆర్టికల్స్.
భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ సమయములో, హిందూ పేపర్ యాజమాన్యం చైనా నుంచి డబ్బులు తీసుకుని, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాను, ఆ దేశ అధ్యక్షుడు అయినటువంటి జిన్ పింగ్ కు భజన చేయడం అంటే భారత్ ను, భారత సైనికులను కించపరచడమే అవుతుంది. డబ్బుల కోసం శత్రుదేశాలకి వంట పాడటం, ఏపాటి నైతిక విలువలకు నిదర్శనం.
మనకు అండగా
ఇంకా చెప్పాలంటే మావోయిస్టు చైనా బాధిత దేశాలైన తైవాన్, హాంగ్ కాంగ్ వంటి ప్రాంతాల్లో అక్కడి ప్రజలు భారత్ కు అండగా నిలబడుతున్నారు. ముఖ్యఖ్యంగా హాంగ్ కాంగ్ లో అయితే నిరంకుశ కమ్యూనిస్టు చైనా పాలకులకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో అక్కడి నిరసనకారులు భారతదేశపు జాతీయ పతాకాన్ని చేతబట్టి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కమ్యూనిస్ట్ చైనాకు, ప్రెసిడెంట్ జిన్ పింగ్ కు భారత ప్రభుత్వం, భారత సైనికులు గట్టిగా బుద్ధి చెబుతున్నారని,
ఇది తమలో ఎంతగానో స్పూర్తిని రగిలించిందని.. అందుకే తాము సైతం భారత జాతీయ పతాకాన్ని చేతబట్టి చైనా కమ్యూనిస్టు పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెబుతున్నారు. ఈ దృశ్యాలు కూడా ఆన్లైన్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
ఆపై హాంగ్ కాంగ్ వాసులు చూపిస్తున్న ప్రేమను, మన దేశంలోని హిందు, వైర్ మరియు ప్రింటు వంటి పత్రికలు మాత్రం చూపలేకపోతున్నారు. ఈ పత్రికలు దేశభక్తిని చూపకపోగా, భారత్ కు వ్యతిరేకంగా చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. దేశ హితం కంటే కూడా కమ్యూనిస్టు ఐడియాలజీయే ఈ పత్రికలకు గొప్పవా.. ప్రధాని మోదీని వ్యతిరేకించే క్రమంలో దేశ ద్రోహానికి సైతం ఒడిగడతాయా.. గత కొద్ది రోజులుగా కమ్యూనిస్టు చైనా అధికార పత్రికలైన గ్లోబల్ టైమ్స్ అలాగే చైనా టైమ్స్ వంటి మీడియా సంస్థలు అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ను దోషిగా నిలబెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయి. అదే పనిగా భారత్ పై దుష్ప్రచారంను మొదలు పెట్టాయి.
జిన్ పింగ్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఈ ప్రచారం మరింత ఎక్కువయిందని, ఈ మధ్యనే ఒక మీడియా తన రిపోర్టులో బయటపెట్టింది. భారత్ వంటి దేశాల్లో మీడియాను మేనేజ్ చేయడం కోసం చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏకంగా ఆరు బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. భారత్ తో పాటుగా అనేక దేశాలు వివిధ మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టుల మెదడులో కమ్యూనిస్టు చైనా, ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ఆలోచనల్ని గొప్పగా ప్రచారం చేసేందుకు సైతం స్టడీ టూర్ లను నడిపిస్తోంది. ఇప్పటికైనా దేశ ప్రజలు ది హిందూ ఇంగ్లీష్ పత్రిక ఇందులో ప్రచురితమయ్యే భారత వ్యతిరేక వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …