ఇంతకూ లోకేష్ టార్గెట్ ఎవరు..? జగనా లేక చంద్రబాబునా..

లోకేష్ టార్గెట్ ఎవరు : పోలవరం గురించి తెలుగుదేశం పార్టీ గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ లకు ప్రస్తుతం ఆ పార్టీ నేత లోకేష్ మాట్లాడుతున్న మాటలకు పొంతన లేకుండా పోతోంది. పోలవరం నిర్వాసితుల సమస్యలంటూ బయలుదేరిన లోకేష్ జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ గా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు. రుణాల మాఫీ చేయలేక పోయాడని.. ఉద్యోగాల భర్తీ చేయలేదనీ.. పోలవరం నిర్వాసితుల సమస్యలు తీర్చలేక పోయాడనీ తీవ్ర పదజాలంతో విమర్శలు చేసాడు.

దీనికి ప్రతిస్పందనగా సోషల్ మీడియాలోనే నెటిజన్లు లోకేష్ కు గట్టి సమాధానమే ఇచ్చారు. మీరు తిట్టేది జగన్ గారైనా లేక మీ తండ్రిగారినా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే వారి తండ్రి ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలు మరిచిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రతి సోమవారంని పోలవరం అన్నారు. పోలవరం పూర్తయిపోతుంది రాసుకో జగన్ నీ పేపర్లో అని అసెంబ్లీ సాక్షిగా అన్నారు. ఆపై పోలవరం నిర్మాణాన్ని చూసి రావడానికి అంటూ ప్రభుత్వ ఖర్చుతో ఏపీ నలువైపుల నుంచి బస్సులలో జనాలను తిప్పారు. అక్కడే జయము జయము చంద్రన్న భజన పాటలు మార్మోగాయి. ( నారా లోకేష్ పాదయాత్ర )

తీరా అధికారం కోల్పోయాక ఇప్పుడు నిర్వాసితుల సమస్య అంటూ లోకేష్ స్పందించారు. మరి జయము జయము చంద్రన్న భజన సమయంలో నిర్వాసితుల సమస్యలు లేవా లేక వీరికి కానరాలేదా. పోలవరం అంతా అప్పుడే పూర్తయిపోయింది అన్నారుగా. రాసిపెట్టుకో అన్నప్పుడు నిర్వాసితుల అంశం గుర్తుకు రాలేదా. ( ప్రమాదంలో చంద్రబాబు ప్రతిపక్ష హోదా )

అంతా చంద్రబాబు హయాంలోనే అయిపోయింది అన్నప్పుడు నిర్వాసితుల సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు అంటూ అధికార పక్షం నుంచి విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై మాట్లాడిన లోకేష్ బాబు.. అప్పుడేమో పోలవరానికి నిధులు రాకుండా జగన్ కేంద్రానికి లేఖలు రాసాడని.. ఇప్పుడేమో నిర్వాసితుల సమస్యలు పట్టించుకోవడం లేదని చెబుతున్నాడు. ఇలా లోకేష్ ప్రజలకు చెవిలో పూలు పెడుతున్న వైనం.

నిజంగా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జగన్ లేఖ రాస్తే నిధులు ఆపుతారా. పనిలో పనిగా లోకేష్ బయటపెడుతున్న విషయం ఏమిటంటే.. పచ్చ బ్యాచ్ చెప్తున్నట్లుగా చంద్రబాబు హయాంలో పోలవరం పోలవరం పనులేవీ పూర్తి కాలేదు. గత రెండేళ్లలో జరిగిన పనులే కాదు.. అతి ప్రధానమైన నిర్వాసితుల సమస్యలు కూడా ఇంకా అలానే ఉంది. ఆ సమస్య పరిష్కారం కాలేదని స్వయంగా లోకేషే ఒప్పుకుంటున్నాడు. అప్పట్లోనే అంతా అయిపోయిందన్న సొంత పార్టీ ప్రచారానికి ఆయన పుత్రరత్నమే చెక్ పెడుతున్నాడు.

More Latest telugu news todayOnline telugu news todayPolitical newsonline news today

1 thought on “ఇంతకూ లోకేష్ టార్గెట్ ఎవరు..? జగనా లేక చంద్రబాబునా..”

Leave a Comment