మరో కఠినమైన లాక్డౌన్ సెప్టెంబర్ 25 నుండి.. నిజమేనా..?

భారతదేశంలో పెరుగుతున్న కరోనావైరస్ COVID-19 కేసుల నేపథ్యంలో, వ్యాప్తిని అరికట్టడానికి సెప్టెంబర్ 25 నుండి మరో లాక్డౌన్ సిఫార్సు చేసినట్లు వచ్చిన వార్తలను ప్రభుత్వం సోమవారం తోసిపుచ్చింది. ఈ వార్తలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో “ఫేక్ న్యూస్” హెచ్చరికతో ఒక పోస్ట్‌లో ఖండించింది.

జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఎ) సెప్టెంబరు 25 నుంచి మరో లాక్‌డౌన్ విధించాలని కేంద్రాన్ని సిఫారసు చేసినట్లు దానికి సంభందించిన నివేదిక స్క్రీన్‌షాట్‌తో సహా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ నివేదికలో ఏముందంటే …

PIB Report

“కోవిడ్ -19 యొక్క వ్యాప్తిని నియంత్రించడానికి మరియు దేశంలో మరణాల రేటును తగ్గించడానికి, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, ప్రణాళికా సంఘంతో పాటు, భారతదేశ ప్రభుత్వాన్ని దీని ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. మరియు సెప్టెంబర్ 25, 2020 అర్ధరాత్రి నుండి 46 రోజుల కఠినమైన దేశవ్యాప్త లాక్డౌన్ను తిరిగి విధించంమని ప్రధాన మంత్రి కార్యాలయానికి, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదేశిస్తున్నాము. దేశంలో నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆటంకం కలగకుండా దానికి కావాల్సిన ప్రకారం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఎన్డిఎమ్ఎ మంత్రిత్వ శాఖకు ముందస్తు నోటీసు జారీ చేస్తోంది.” అని ఆర్డర్ లో పేర్కోనివుంది. ( కాంగ్రెస్ పార్టీనా .. మజాకా )

అయితే సోషల్ మీడియాలో చెలామణిలో ఉన్న ఎన్‌డిఎంఎ ‘ఆర్డర్’ నకిలీదని పిఐబి ట్వీట్ చేసింది.
” సెప్టెంబరు 25 నుండి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని ప్రభుత్వానికి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ జారీ చేసిన ఒక ఉత్తర్వులు నిజం కాదని అది నకిలీదాని” PIB ట్వీట్ చేసింది.

దేశంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మార్చి 24న ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసినదే. అది మళ్ళీ జూన్ నుండి దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేయబడుతూ వస్తుంది.

Leave a Comment