మహిళ ప్రాణం తీసిన పానీపురి..

పానీపూరి ఓ మహిళ ప్రాణం తీసింది. అదేంటి పానీపురి తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని తినేందుకు చాలామంది ఎగబడుతుంటారు. అలాంటి పానీపురి ఒక మహిళ ప్రాణాలు తీయడమేంటని అనుకుంటున్నారా.. నిజంగా ఇది నమ్మాల్సిందే. ఈ ఘటన ఒడిశాలోని సుందరగడ్‌ జిల్లా సరఫ్‌గడ్‌లో జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంం పూలమతి అనే మహిళకు పానీపూరి తినాలనిపించింది. వెంటనే తన కుటుంబంతో కలిసి గప్‌చుప్‌ బండి దగ్గరికి వెళ్లింది. గప్‌చుప్‌ బండి అతను పానీపూరి ఆమె చేతితో పెట్టగానే వెనకా ముందు ఆలోచించకుండా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుటుక్కన మింగింది. వెంటనే ఆమె స్పృహతప్పి కిందిపడి చనిపోయింది. ఏమిటి.. పానీపురి నోట్లో వేసుకోగానే పడిపోయిందా.. వెంటనే చనిపోయిందా..? అలా అయితే, దానిలో ఏదో విష పదార్థం ఉందన్న అనుమానం వస్తుంది కదా.. మీరు అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇంతకు ఆ మహిళ ఎందుకు స్పృహతప్పి పడిపోయిందంటే పానీపూరి నమలకుండా మింగడంతో గొంతులో ఇరుక్కపోయి శ్వాస ఆడక చనిపోయింది.

చూశారా. మనకు ఎంత ఇష్టమైన ఆహారమైనా సరిగా నమలకుండా తింటే ఏమవుతుందో.. ఆ ఆతృతే ఆ మహిళ ప్రాణాలను తీసింది మరి.

Leave a Comment