తెలుగుదేశం పార్టీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్..!

ఏపీలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయాలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. రాజకీయాల్లో హుందాతనం ఉండాలన్నారు.

ఏపీలో ఒక ముఖ్య మంత్రిని పట్టుకొని ఆ భూతులు ఏంటని ప్రశ్నించారు. టిడిపి ఆఫీస్ మీద దాడులు ఎవరు చేశారు అనేది పక్కన పెడితే అందుకు మూలం ఎక్కడుందని ప్రశ్నించారు. టిడిపి వారు బూతులు తిట్టడం వల్లనే కదా ఆ పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎందుకింత అసహనం అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ( మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి.. ? ఏపీ హైకోర్టు )

నువ్వు రాజకీయాల్లో ఓడిపోయావు.. సహనం పాటించు.. ఐదేళ్ల తర్వాత మళ్లీ జనం వద్దకు వెళ్లి బతిమిలాడు.. మీకు ఎందుకు ఓటు వేయాలో వివరించుకో.. అంతేతప్ప అర్జెంటుగా అధికారంలోకి వచ్చేయాలన్న యావ, ఆరాటం ఎందుకని చంద్రబాబు నాయుడిని కేటీఆర్ ప్రశ్నించారు.

ఏపీలో అధికారం పోగొట్టుకున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్తిగా అంతర్థానమై పోయింది అని వ్యాఖ్యానించారు. ఉద్యమాల సమయంలో ఏదైనా ఆవేశంగా మాట్లాడారంటే అర్థం ఉంది కానీ.. ఇలా పదే పదే బూతులు మాట్లాడటం ఏంటని ఆయన తప్పుబట్టారు. ( చంద్రబాబు డిమాండ్.. నిజంగా అంత సీన్ వుందా.. !)

తెలంగాణలో కూడా కొందరు ఇలాంటి 420 గాళ్ళు వున్నారని కేటీఆర్ విమర్శించారు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని దూషించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చూస్తున్నాము కదా అంటూ కేంద్ర మంత్రిని అరెస్టు చేసిన ఉదంతం కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణలోనూ కొందరు 420 గాళ్ళు సీఎంను ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. ఇది రాజకీయాల్లో సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.

టిఆర్ఎస్ లో తిరుగుబాటు వస్తుంది అంటున్న రేవంత్ రెడ్డి.. ముందు తానెప్పుడు జైలుకు వెళతారో చూసుకోవాలన్నారు. గాంధీభవన్ లోనికి గాడ్సే దురారని పంజాబ్ మాజీ సీఎం అమరేందర్ సింగ్ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ప్రస్తావించారు.

Leave a Comment