తొలి వ్యాక్సిన్‌ తెలంగాణ నుంచే అనుకుంటున్నా : కేటీఆర్

KTR Biotech

ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని, కరోనాకు తొలి వ్యాక్సిన్‌ ఇక్కడ నుంచే వస్తుందని తాను ఆశిస్తున్నానని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని జినోమ్‌వ్యాలీలో ఉన్న భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ ప్రొడక్షన్‌ సెంటర్‌ను కెటిఆర్‌ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను తరిమికొట్టే వ్యాక్సిన్‌ హైదరాబాద్‌లో తయారవుతోందన్నారు. భారత బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌పై నిమ్స్‌ సహా దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో క్లీనికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయన్నారు.

దేశం మొత్తం మనవైపే చూస్తోంది

ఈ క్రమంలో దేశం యావత్తు హైదరాబాద్‌ వైపే చూస్తోందని అన్నారు. మంత్రి కేటీఆర్‌తో పాటు డాక్టర్‌ ఎల్లా, శ్రీమతి సుచిత్రా ఎల్లా కూడా పాల్గొన్నారు. భారత్‌ బయోటెక్‌ సంస్థ ఉద్యోగులతో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. అనంతరం వ్యాక్సిన్‌ కోసం పోటీలో సైన్స్, అత్యవసరంసమతుల్యత అంశంపై నిపుణులు, అనుభవజ్ఞులతో మంత్రి కేటీఆర్‌ ముచ్చటించారు. ఫార్మా రంగంలో మూడింతల మందులు హైదరాబాద్‌ నుంచే ఉత్పత్తి జరుగుతోందని కేటీఆర్‌ తెలిపారు. ఫార్మారంగంలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉందన్నారు. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ బయోటెక్‌ ముందంజలో ఉండటం గర్వంగా ఉందన్నారు.

కరోనాకు టీకా తొలుత హైదరాబాద్‌ నుంచి వస్తుందని, అది భారత్‌ బయోటెక్‌ నుంచి వస్తుందని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. టీకాల అభివృద్ధి, తయారీలో భారత్‌ భాగస్వామ్యం కీలకమైందని ప్రపంచదేశాలు పదే పదే చెబుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ అవసరాల దృష్టా హైదరాబాద్‌ ప్రాముఖ్యత కూడా పెరిగినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ నుంచి మూడవ వంతు వ్యాక్సిన్‌ ప్రపంచ దేశాలకు అందించడం గర్వంగా ఉందన్నారు.

Leave a Comment