నంద్యాల ఘటన ద్వారా రాజకీయం చేద్దామనుకున్న 40 ఏళ్ళ చంద్రబాబు వ్యూహాన్ని ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి పటాపంచలు చేశాడు అని చెప్పవచ్చు. జరిగిన ఘటన బాధాకరమని సీఎం జగన్ అన్నారు. ఘటనకు బాధ్యులైన పోలీసులను వెంటనే అరెస్టు చేశామని కూడా తెలిపారు.
టిడిపి ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న రామచంద్రరావు నిందితుల తరపున బెయిల్ పిటిషన్ వేశారని కూడా ఈ సందర్భంగా జగన్ చెప్పారు. న్యాయవ్యవస్థలో నిందితులకు బెయిల్ కూడా మంజూరు అయిందన్నారు. బెయిల్ రద్దు చేసేందుకు హైకోర్టును ఆశ్రయించామని కూడా సీఎం తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరామన్నారు.
మంచి చేయాలని తాము ఎంతగానో ఆలోచిస్తుంటే.. ఎలా బురదజల్లాలా అని చంద్రబాబు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ట్విట్టర్, జూమ్ లో మాత్రమే మైనార్టీలపై ప్రేమ చూపిస్తున్నారని,నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం 40 ఏళ్ల వ్యక్తి.. అతని భార్య, కుమారుడు అందరు కూడా ఆత్మహత్య చేసుకోవడం నన్ను ఎంతగానో బాధకు గురి చేసిందని చెప్పారు ముఖ్యమంత్రి గారు.
ఈ నెల 3వ తేదీన గూడ్స్ రైలు కింద పడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ఆ రోజు అతని భార్య, తాను సెల్ఫీ వీడియోని కూడా తీసుకొని దాన్ని బయటకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్ తక్షణమే విచారణ జరిపించాలని డీజీపీ సవాంగ్ ను ఆదేశించారు.
దీంతో బెటాలియన్ ఐజీ , గుంటూరు అడిషనల్ ఎస్పీ హఫీజ్ అధికారులుగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. షేక్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులుగా గుర్తించిన సీఐ సోమశేఖర్ రెడ్డి అలాగే హెడ్ కానిస్టేబుల్ అయిన గంగాధర్ ను వెంటనే అరెస్ట్ చేసి పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
24 గంటల లోపే
అయితే జగన్ ఆదేశాలు జారీ చేసిన కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి హెడ్ కానిస్టేబుల్ ను అరెస్టు చేయడంపై పలు ముస్లిం, మైనారిటీ సంఘాలు కూడా జగన్ కు జై కొడుతున్నాయి. ఇక ఈ ఘటనపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మతాలు కులాలు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఆయన సలహా ఇచ్చారు.
ప్రభుత్వం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే గనుక తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నడూ కులాలను, మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయలేదని.. చంద్రబాబులా అధికారం కోసం మనుషుల మధ్య చిచ్చు పెట్టాలని చూసే వ్యక్తి కాదు జగన్ అని కొడాలి చురకలు అంటించారు.
నంద్యాల షేక్ అబ్దుల్ ఆత్మహత్య ఘటనను రాజకీయం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్న చంద్రబాబును చూస్తుంటే పిచ్చివాడు గుర్తొస్తున్నాడు అంటూ ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎప్పుడూ మైనార్టీలను పట్టించుకోలేదన్నారు. అధికారంలో ఉన్న సమయంలో మైనార్టీలను ఆదుకోని చంద్రబాబు.. ఇప్పుడు ఈ ఘటనపై మొసలి కన్నీరు కారుస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీచ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు జూమ్ ఆప్ ద్వారా సీఎం జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలు టిడిపికి కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితం చేసినా కూడా ఇంకా చంద్రబాబు బుద్ధి మాత్రం మారలేదని.. ఇక ముందు రోజుల్లో జరిగే దానిపై పూర్తిగా చంద్రబాబుకు చుక్కలు చూపడం ఖాయం అన్నారు.
చంద్రబాబు ఎక్కడ ఏ అవకాశం దొరికినా కూడా దాన్ని పట్టుకొని దాడులకు పాల్పడుతున్నారు. ఎవరు ఎక్కడ ఏం చేసినా కూడా దాన్ని ప్రభుత్వానికి అంటగడుతూ జగన్ గారిని బదనాం చేసే బాధ్యతను ముందు పెట్టుకుంటున్నారు. బహుశా చంద్రబాబుకు అర్థం కావటం లేదేమో .. ఇవన్నీ రివర్స్గా పెనుముప్పుగా మారే ప్రమాదముందని.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …