KL రాహుల్ సెంచరీ.. పంజాబ్ ఘన విజయం..

గురువారం రాత్రి, IPL 2020లో 6వ మ్యాచ్‌లో భాగంగా కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్‌ (KXIP), రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టుపై పంజాబ్‌ జట్టు అద్భుతమైన ఘన విజయం సాధించింది. ఏకంగా 97 పరుగుల తేడాతో పంజాబ్ విజయ దుందుభి మోగించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టేన్ కేఎల్ రాహుల్ మ్యాచ్ ఆమాంతం తన వన్ మ్యాన్ షో ఆట తీరు కనబర్చాడు. ఏకంగా 14ఫోర్లు, 7 సిక్సర్లతో 132 పరుగుల భారీ స్కోరుతో జట్టు విజయం వైపు పరుగులు పెట్టించాడు. రాహుల్ బౌండరీల ధాటికి పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసుకుంది.

207 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు లక్ష్య ఛేదనలో తడబడింది.సరైన ఆటతీరు ప్రదర్శియించలేక పోయింది. ఏ దశలోనూ పంజాబ్ జట్టు స్కోరును అందుకునే పరిస్థితి కనిపించలేదు. పంజాబ్ జట్టు బౌలర్లు వారి ఆట తీరుతో బెంగళూరు బ్యాట్స్‌మెన్స్‌ని 17 ఓవర్లకే 109 పరుగులకే ఆలౌట్ చేసి కట్టడి చేశారు. RCB లో ఏబి డివిలియర్స్‌ (28), వాషింగ్టన్‌ సుందర్‌ (30),ఆరోన్ ఫించ్‌ (20),శివం దూబే (12) బ్యాట్స్‌మెన్స్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగా మిగతావారెవరు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.( ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్.. )

కష్టకాలంలో జట్టును గట్టెక్కించే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సైతం కాట్రెల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఒకే ఒక్క పరుగుతో వెనుదిరిగాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తొలి మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన ఓపెనర్‌ దేవదూత్‌ పడిక్కల్ కూడా ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. దీంతో మిగతా ఆటగాళ్లంతా చేసేదేమిలేక చేతులెత్తేశారు. 97 పరుగుల భారీ తేడాతో కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్ పై ఓడిపోయారు.

Leave a Comment