కేశినేని నాని మరోసారి ట్వీటర్ వేదికగా తన గళం వినిపించాడు. ” ఎవరి కలలు వారే సాకారం చేసుకోవాలి,మన కలలు వేరేవాళ్లు సాకారం చేస్తారు అనుకోవడం అవివేకం అవుతుంది. మీడియాను,పత్రికలను నమ్ముకొని అధికారంలోకి రాలేము”. అని ట్వీట్ చేశారు. అయితే ఇది చంద్రబాబు ని ఉద్దేశించి చేసినట్టుగా చర్చ జరుగుతుంది. రెండు రోజుల క్రితం నుండి చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమనడం,లేదంటే అమరావతికి సంబందించిన వివరాలను రెండు రోజుల కొకసారి మీడియా ముఖంగా వెల్లడిస్తానని ప్రకటన విడుదల చేసారు.
దీనికి కౌంటర్ గా కేశినేని నాని ట్వీట్ చేసి ఉంటాడని పలువురు రాజకీయ నాయకులు భావిస్తున్నారు. నాని ఇంకా ఏమన్నారంటే, 2024 లో టీడీపీ అధికారంలోకి రావాలంటే ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ వారిని అండగా ఉండాలని , వారి సహకారంతోనే అధికారం సాధ్యమవుతుందని అన్నారు. దీనికి టీడీపీ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదిక
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు