కేసీఆర్ జాతీయస్థాయిలో కొత్త పార్టీని పెట్టబోతున్నారని, ఇప్పటికే ‘నవభారత్’ పేరుతో పార్టీ పేరును కూడా రిజిస్టర్ చేసే పనిలో ఉన్నారన్న వార్తలు వినబడుతున్నాయి.
అసలు తెలంగాణలో సీఎం పదవిని తన కుమారుడు కేటీఆర్‌కు అప్పగించి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారని అందరూ ఎప్పటినుంచో అనుకుంటున్నదే. అయితే, జాతీయ రాజకీయాల్లోకి ఎలా ఎంట్రీ ఇస్తారు అనే దానికి సమాధానం లేకుండా పోయింది. కానీ జాతీయస్థాయిలో పార్టీని పెట్టి అక్కడ రాజకీయాలను మలుపు తిప్పేందుకు ఆయన కృషి చేస్తున్నారన్న వార్తలు ఈ అనుమానాలకు తెరదించాయి.
అయితే, ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించగలరా..? అని. తెలంగాణలో సెంటిమెంట్ పేరుతో అధికారంలోకి వచ్చిన ఆయన తర్వాత కాలంలో విపక్షాలను బలహీనపరిచి తన పార్టీని, సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఇదే విధానాన్ని జాతీయ రాజకీయాల్లోనూ అవలంభిస్తారా.. ఒకవేళ ఇది సాధ్యమయితే .. ఇతర రాష్ట్రాల్లోని పార్టీలు కేసీఆర్‌తో చేతులు కలపడానికి ముందుకు వస్తాయా..? లేకుంటే మరోసారి మూడో ప్రత్యామ్నాయం బొక్కబోర్లా పడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి ఇప్పుడు దేశంలోని రాజకీయాలన్నీ బీజేపీ కనుసన్నల్లోనే నడుస్తున్నాయన్నది కాదనలేని సత్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న విపక్ష పార్టీలు కేసీఆర్‌తో కలిసి వస్తాయా.. ఒకవేళ వచ్చినా బీజేపీపై పూర్తిస్థాయిలో ఆగ్రహంగా ఉన్న బెంగాల్‌లోని మమతాబెనర్జీలాంటి వారు తప్ప మిగతా ఎవరూ కనిపించడం లేదు. మిగతా రాష్ట్రాల్లో అధిక శాతం మోడీతో సన్నిహితంగానే ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేశంలో బలంగా ఉండి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా.. నిలబడుతుందో లేదో తెలియని కేసీఆర్ పార్టీవైపు ఎవరు వస్తారు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మన పక్కరాష్ట్రమైన ఏపీలో జగన్ సర్కారు అధికారంలో ఉంది. పైకి ఎన్ని అనుకున్నా వైసీపీ–బీజేపీ మధ్య దోస్తీ నడుస్తూనే ఉంది. అయితే, జగన్‌కు కేసీఆర్‌కు మధ్య కూడా దోస్తీ ఉందనుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కేసీఆర్‌కు సహకరిస్తారా అన్న సందిగ్ధం కూడా నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో ఎలా నిలదొక్కుకుంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ తీరు మెచ్చేదెవరు ?
మామూలుగానే కేసీఆర్ ఎవరి మాటా వినేరకం కాదు. ఈ విషయం టీఆర్‌ఎస్ నాయకులే అక్కడక్కడా కార్యకర్తలకు చెప్పుకొని బాధపడుతున్నారన్న ప్రచారం ఉంది. అలాంటి పరిస్థితిని కేంద్ర రాజకీయాల్లోనూ చూపితే భాగస్వామ్య పక్షాల నేతలు ఊరుకుంటాయా.. పైగా ఆయనతో కలిసివచ్చే ఒకరిద్దరు నేతలున్నా వారు కూడా కేసీఆర్ మనస్తత్వం ఉన్నవారేనని అలాంటప్పుడు తమ మాటే నెగ్గాలని వారి మధ్య కొత్త పంచాయితీ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేసీఆర్ కొత్త పార్టీని పెట్టి కేంద్ర రాజకీయాల్లో ఎలా మనగలుగుతారో.. కేసీఆర్ స్ట్రాటజీ ఏమిటో తెలియడం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. మరికొంత కాలం పోతే తప్ప దీనిపై క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్‌కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …