హుజురాబాద్ ఉపఎన్నిక వాయిదా | తెలంగాణ భవన్ శంకుస్థాపన కోసం కేసీఆర్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ మూడు రోజులు మాత్రమే. కానీ కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ఇప్పటికే ఐదు రోజులు అయిపోయింది. దీంతో అక్కడ ఏం రాజకీయాలు చేస్తున్నారు.. ఏం మంత్రాంగం నడుపుతున్నారు అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి. కేసీఆర్ చేసే ప్రతి పనికి ఒక అర్థం.. అంతరార్థం ఉంటాయి. సింపుల్ గా చెప్పుకోవాలంటే కేసీఆర్ ప్రతి పనిలో రాజకీయ ప్రయోజనాలు చూస్తారు. ( హుజురాబాద్ ఉప ఎన్నిక )
కేసీఆర్ కు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ చాలా సులభంగానే దొరికింది. ఇద్దరూ బాగా ఎక్కువ సమయమే ఇచ్చారు. ముందుగానే తయారుచేసి పెట్టుకున్న వినతి పత్రాలు వారికి అందజేశారు. ఇది మీడియాకు అందిన వార్త. కానీ లోపల ఇంకా ఏం జరిగి ఉంటుంది. తెలంగాణలో బిజెపి, టిఆర్ఎస్ పైకి కొట్టుకున్నట్లు కనబడుతున్నా.. కేసీఆర్, మోదీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, కొట్టుకోవడం కూడా ఒక విధమైన డ్రామా అని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంటుంది. కొన్ని విషయాలను చూస్తే ఇది నిజమేనేమో అని అనిపిస్తుంది. ( పక్క చూపు చూస్తున్న బీజేపీ నేతలు )
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!
- బయటకొచ్చిన తీన్మార్ మల్లన్న.. టార్గెట్ ఫిక్స్..!!
ఎందుకంటే దక్షిణ భారతదేశానికి చెందిన ఏ రాజకీయ పార్టీకి ఢిల్లీలో ఇప్పటి వరకు సొంత భవనం లేదు. పార్టీ భవనం కోసం స్థలం ఇచ్చేసరికి తాజా భేటీలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి కూడా భవనం పట్టుకుంటామని, స్థలం కావాలని అడిగారు. సరేనని మోడీ కూడా హామీ ఇచ్చారు. ఇక తెలంగాణ పర్యటనకు వచ్చే కేంద్రమంత్రుల్లో ఎక్కువమంది కేసీఆర్ పథకాలను ఎక్కువగా పొగుడుతూ వుంటారు. కేంద్ర మంత్రులు రాష్ట్ర పథకాలను పొగడటం తమకు ఇబ్బందిగా ఉందని ఇక్కడి నాయకులు కేంద్ర మంత్రులకు చాలాసార్లు చెప్పారు. ( పార్లమెంట్ చట్టాల్లో నాణ్యత లోపం )
కేసీఆర్ తాజా పర్యటనలో కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వద్దని ఇక్కడ బిజెపి నాయకులు ప్రధానిని కోరారట. అయినా మోడీ అపాయింట్మెంట్ వెంటనే దొరికింది. కేంద్రంలో మూడోసారి కూడా అధికారంలోకి రావాలి అనుకుంటున్న బీజేపీ, తమకు సీట్లు తగ్గితే టిఆర్ఎస్, మరికొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకోవాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసీఆర్, మోడీ మధ్య చర్చలు జరిగి ఉంటాయని మీడియా అంచనా వేస్తోంది.
- దేశం మొత్తానికి గంజాయి సరఫరా చేసిన క్రెడిట్ మాదే.. గంటా శ్రీనివాస్
- బోండా ఉమాపై అందుకే కేసు నమోదు చేయలేదేమో.. !
- సిఐ నాయక్ పై దాడి.. నారా లోకేష్ పై హత్యాయత్నం కేసు
కేసీఆర్ మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని పెద్దగా వ్యతిరేకించలేదు కూడా. బీజేపీకి అంశాల వారి మద్దతు ఉంటుందని తెలిపింది. తాజాగా హుజరాబాద్ ఉప ఎన్నిక కూడా కేసీఆర్, మోడీ భేటీ తర్వాతే వాయిదా పడిందని అంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తొందరగా జరగాలని రాష్ట్ర బీజేపీ కోరుకుంటుంటే.. అది కాస్తా వాయిదా పడింది. ఈ విధంగా కేంద్రం టీఆర్ఎస్ విజయానికి అవకాశం కల్పించిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎంతైనా కేసీఆర్ ఏ ప్లాన్ లేకుండా ఏ పనీ చేయరుగా.
2 thoughts on “హుజురాబాద్ ఉపఎన్నిక వాయిదా వెనుక అసలు మతలబు ఇదేనా..!”