ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిలో ఉండడానికి అనర్హుడని, ఆయన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని శాసనసభ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గవర్నర్ను కోరారు.
ఈ మేరకు ఆదివారం కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పంచాయతీ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని వెంటనే గృహనిర్బంధంలో ఉంచాలని ఎలక్షన్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేయడం నిమ్మగడ్డకు చెంపపెట్టులాంటిది అన్నారు. ( హైకోర్టులో నిమ్మగడ్డకు ఎదురుదెబ్బ )
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎందుకు మితిమీరి ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తన పరిధి దాటి ప్రవర్తించి వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తూ టిడిపికి అనుకూలంగా వ్యవహరించడమనేది దుర్మార్గమని అన్నారు.
పారదర్శికంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎస్ఈసీ ఏకపక్షంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించినందుకు హైకోర్టు మొట్టికాయలు వేసిందని చెప్పారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇచ్చిన నోటీసు మీద ప్రివిలేజ్ కమిటీ కూడా నిమ్మగడ్డ వ్యవహారంపై విచారణకు స్వీకరించామన్నారు.
శాసనసభ రాజ్యాంగ వ్యవస్థ అని, అది కోర్టు పరిధిలోకి రాదన్నారు. అసెంబ్లీ కానీ, ప్రివిలేజ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని కానీ నిమ్మగడ్డ రేపు కోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేరని వెల్లడి చేశారు.
రాజ్యాంగానికి మూలస్తంభమైన శాసనసభ తీసుకునే నిర్ణయానికి నిమ్మగడ్డ కట్టుబడి ఉండాల్సిందేనని.. తప్పనిసరిగా విచారణ చేపడతాంమని.. విచారణలో వాస్తవాలు బయటకు తీసిన తర్వాత ఎన్నికల కమీషనర్ చర్యల మీద, ఆయన చేసిన వ్యాఖ్యల మీద తప్పని సరిగా చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
నిమ్మగడ్డ చర్యల వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. చేసిన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధంగా ఉండాలని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …