ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత తెలంగాణ హైకోర్టుకు బదిలీ కానున్నారు. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సెప్టెంబర్ 16న సమావేశమైన కొలీజియం జస్టిస్ కన్నెగంటి లలితను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సిఫార్సు చేసింది. ఈ తీర్మానాన్ని గురువారం సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరిచారు. ( జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోసం చంద్రబాబు ఆరాటం )
గుంటూరు జిల్లాకు చెందిన జస్టిస్ కన్నెగంటి లలిత 2020 మేలో హైకోర్టు న్యాయమూర్తిగా వచ్చారు. ఏపీలోని పలు కీలకమైన వ్యక్తుల బెయిల్ పిటిషన్లను, పలు కేసులను విచారించి తీర్పు ఇచ్చారు. గతంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలువురు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. జగన్మోహన్రెడ్డి ఫిర్యాదు చేసిన న్యాయమూర్తుల పేర్లలో జస్టిస్ కన్నెగంటి లలిత పేరు కూడా ఉంది. ( అసెంబ్లీ రద్దు చేయాలంటున్న టీడీపీ )
- జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోసం చంద్రబాబు ఆరాటం.. అది సాధ్యమవుతుందా.. ?
- అసెంబ్లీ రద్దు చేయాలంటున్న టీడీపీ.. మరి ముందస్తు ఎన్నికలకు రెడీనా..!
- వినాయకుడు | లోకరక్షకుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు
- నారా లోకేష్ పాదయాత్ర.. నాయకుడిగా సక్సెస్ అవుతాడా.. ?
- బీజేపీ సరికొత్త వ్యూహం.. బెంగాల్ విభజన రాగం..!
మెడికల్ స్కాం లో అరెస్టైన అచ్చెన్నాయుడిని ఆస్పత్రికి మార్చేలా ఆదేశాలు ఇచ్చారని.. ఆ తర్వాత మరో ఆస్పత్రికి మార్చారని.. చివరకు ఆసుపత్రి నుంచే విడుదలయ్యేలా బెయిల్ ఇచ్చారంటూ జగన్ మోహన్ రెడ్డి తన ఫిర్యాదులో ఎత్తిచూపారు. కృష్ణానదీ గర్భంలో కరకట్ట వెంబడి నిర్మించిన అక్రమ కట్టడాలు తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. అక్కడ చంద్రబాబు నివాసం కూడా ఉందని ఆ ప్రక్రియపైన జస్టిస్ కన్నెగంటి లలిత స్టే ఇచ్చారని జగన్ తన ఫిర్యాదులో అప్పట్లో ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. జస్టిస్ కన్నెగంటి లలితను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు చేసిన సిఫార్సును రాష్ట్రపతి ఆమోదించిన వెంటనే అది అమలులోకి వస్తుంది.
1 thought on “ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత బదిలీ”