జూలై 23 పైగా శుక్రవారం … ఏం జరగబోతోంది.. ?

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్లు ప్రతిపక్ష టీడీపీ పార్టీకి వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ మరింత సంచలనంగా మారింది. టీడీపీ భవిష్యత్తు పై ఆ పార్టీ నేతలను కలవరపరుస్తోంది. ఇంతకీ జూలై 23న ఏం జరుగుతుంది అంటూ టిడిపి లో చర్చ మొదలయ్యేలా చేశారు విజయసాయి రెడ్డి.

ఆ ట్వీట్ లో ఏముందంటే ” 23వ తేదీ టిడిపికి కాలరాత్రి. రాష్ట్రానికి పట్టిన శని వదిలిన రోజు. రెండేళ్ల క్రితం గురువారం మే 23కే టిడిపి అంతలా వణికింది. గోడ దెబ్బ – చెంప దెబ్బ అన్నట్టుగా ఈ ఏడాది జూలై 23న శుక్రవారం వస్తుంది. ఆరోజు పచ్చ పార్టీ పటాపంచలేనా..? దేవుడు ఏం రాసిపెట్టాడో ..? ” అని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

సరిగ్గా రెండేళ్ల క్రితం 2019 మే 23న ఎన్నికల ఫలితాలు రావడం, టిడిపి 23 సీట్లకే పరిమితం కావడం అందరికీ తెలిసిందే. అప్పుడే రాష్ట్రానికి పట్టిన శని వదిలింది అని.. జగన్ ప్రభంజనం మొదలైంది అని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

అంతవరకు బాగానే ఉంది. అయితే గోడ దెబ్బ – చెంప దెబ్బ లాగా ఈ ఏడాది జూలై 23న దేవుడు పచ్చ పార్టీ పటాపంచలేనా..? దేవుడు ఏం రాసి పెట్టాడో.. ? అని పెట్టిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలలో ఆల్రెడీ నలుగురు చంద్రబాబుని ఛీ కొట్టారు. వారితో పాటు మరికొందరు వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారని అందరికీ తెలిసిందే.

మరి వారి చేరికకు లేదా టీడీపీకి వారు చేసే రాజీనామాలకు జూలై 23 ముహూర్తంగా పెట్టుకున్నారా అనేది ఇప్పుడు అందరిలో వున్న డౌట్. పచ్చ పార్టీ పటాపంచలు అవుతుందన్న ట్వీట్ కి అర్థం అదే అంటూ కొంతమంది విశ్లేషకులు చెబుతున్న మాట. లేదా చంద్రబాబు, లోకేష్ ల విషయంలో వైసిపి ఇంకా ఏదైనా ప్లాన్ చేసిందా అన్నది కూడా తేలాల్సి ఉంది.

మొత్తంమీద విజయసాయి ట్వీట్ కి స్పందనగా చాలా మెసేజ్లు వస్తున్నాయి. ఈ దివ్య ముహూర్తానికి ఏం జరుగుతుందో చెప్పండి అంటూ చాలామంది రీట్వీట్ చేస్తున్నారు. దీంతో టిడిపి నేతలు, కార్యకర్తల్లో ఏం జరుగుతోందో అన్న కలవరం మొదలైంది.

Leave a Comment