జియోలో కొత్త ప్లాన్ .. పోస్ట్ పెయిడ్ ప్లస్ రూ.399

టెలికాం కంపెనీ జియో కొత్త పోస్టు పెయిడ్ ప్లాన్ ను లాంచ్ చేసింది. జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ పేరుతొ దీనిని తీసుకు వచ్చింది. నెల టారిఫ్ రూ.. 399 నుండి రూ.. 1499 వరకు ఈ ప్లాన్ నందు అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీసులను ఎంచుకున్న వారికి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ మరియు హాట్ స్టార్ వంటి ఓటిటిల సబ్ స్క్రిప్షన్ లను ఫ్రీగా జియో అందించనుంది. దీంతో మిగతా టెలికాం సర్వీసుల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ( Gmail యొక్క సరికొత్త లోగో.. త్వరలో. )

స్మార్ట్ ఫోన్ ప్రీ పెయిడ్ కేటగిరీ లో 40 కోట్ల కస్టమర్ల నమ్మకాన్ని సాధించామని, పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్ లాంచ్ కి ఇదే మంచి సమయమని జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ అన్నారు. జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ ఈ నెల 24 నుంచి జియో స్టోర్ లలోకి అందుబాటులోకి రానుందని, తమ కష్టమర్ల పోస్ట్ పెయిడ్ కేటగిరీ విస్తరించాలని అనుకుంటున్నట్టు అయన తెలిపారు.

Leave a Comment