జయప్రకాష్ నారాయణ కామెంట్స్ : ఏపీలో రాజకీయాలు గరంగరంగా మారుతున్నాయి. అధికార పార్టీ వైసీపీపై , ప్రతిపక్ష పార్టీ టీడీపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ కార్యాలయం పై దాడులతో హాట్ టాపిక్ గా మారాయి ఏపీ రాజకీయాలు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రాజకీయాల్లో సైలెంట్ అయిన లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ.. చాలా రోజుల తర్వాత తెరపైకి వచ్చారు. ఇరు పార్టీల నేతలకు పలు సూచనలు చేశారాయన.
తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి, సీఎం జగన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ కార్యాలయం పై దాడులకు దిగారు. అయితే పోలీసులు పట్టాభిని అరెస్టు చేయగా.. తాజాగా బెయిల్ పై విడుదల అయ్యారు. అయినా రెండు పార్టీల మధ్య యుద్ధవాతావరణం ఇంకా సమసిపోలేదు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య జరిగిన పోరు రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టిచ్చింది. ( జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోసం చంద్రబాబు ఆరాటం )
2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 2019లో అధికారాన్ని కోల్పోయింది. అదే వైసిపి పార్టీ 2019లో అధికారంలోకి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టిడిపి నాయకులను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసిపి, టిడిపి మధ్య నిత్యం పోరు కొనసాగుతూనే ఉంది. అయితే మధ్యలో జరిగిన అన్ని ఎన్నికలలో మాత్రం వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తోంది. కానీ టీడీపీ మాత్రం ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపే క్రమంలో వైసీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.
ఇటీవల గంజాయికి సంభందించిన విషయంలో టిడిపి నాయకుడు పట్టాభి, సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కొందరు వైసిపి నాయకులు పట్టాభి ఇంటికి వెళ్లి దాడి చేశాఋ. ఈ దాడులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఒక రోజు బంద్ కు కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నాయకులు ఈ పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. కొందరు ఇరు పార్టీలకు సూచనలు చేస్తున్నారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదిక
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు
ఇందులో భాగంగా జయప్రకాష్ నారాయణ చేసిన సూచనలు ఆసక్తిగా మారాయి. ఆయన ఏమన్నారంటే ” రాష్ట్రంలో నెలకొన్న వివాదాలు సమసిపోయేలా చేయాలి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల్లో రాజకీయాలపై నమ్మకం పోతుంది. ఇరు పార్టీలు శాంతియుత వాతావరణంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ద్వారా ఇరు పార్టీల పై ప్రజలకు అసహనం కలిగే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వంలో.. అధికారంలో ఉన్న వైసిపి సైతం సంయమనం పాటించాలి. ఇరు పార్టీల నేతలు కవ్వింపు చర్యలకు పోకుండా ఉండాలి. పెద్ద మనసుతో ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలని.. లేనిపక్షంలో సమస్య పెరుగుతుందని ఆయన సూచించారు. ( నారా లోకేష్ పాదయాత్ర )
ఇంకా ఆయన మాట్లాడుతూ “ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఈ ప్రభావం అందరి పైన పడే అవకాశం ఉంది. ఆదాయం ఇచ్చే నగరాన్ని ఇప్పటికే కోల్పోయామని.. దీంతో మరింత శ్రమించాల్సిన అవసరం ఏర్పడింది. సంక్షోభం ఏర్పడిన సమయంలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు సహకరించుకోవాలి. అప్పుడే రాష్ట్ర అభివృద్ధికి న్యాయం చేసిన వారు అవుతారు. రాష్ట్రానికి అనేక రకాలుగా పెట్టుబడులకు అవకాశం ఉందని.. ఆ అవకాశాలను జారవిడుచుకోవద్దని సలహా ఇచ్చారు జయప్రకాశ్ నారాయణ.
రాష్ట్రంలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో వినియోగించుకుంటే రాష్ట్ర అభివృద్ధి త్వరగా జరిగే అవకాశం ఉంది. ఖనిజ సంపద కూడా రాష్ట్రంలో పుష్కలంగా ఉంది. వాటి వినియోగానికి సరైన మార్గం వెతకాలి. భవిష్యత్ కోసం ఎందరో ఇప్పటికే అనేక త్యాగాలు చేశారు. వారి త్యాగాలను వృధా కానివ్వద్దు. ఇలా వ్యక్తిగతంగా దూషణలు చేసుకోవడం ద్వారా రాష్ట్రం పరువు పోతుంది అవి జయప్రకాష్ నారాయణ సూచించారు. మరి ఆయన చేసిన ఈ సూచనను ఈ రెండు పార్టీలు పాటిస్తాయో లేక లైట్ తీసుకుంటాయో ఆలోచించాల్సిన విషయమే.