నటుడు జయప్రకాష్ రెడ్డి ఇక లేరు..

టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి మంగళవారం కన్నుమూశారు. కరోనాతో లాక్ డౌన్ వలన షూటింగులు లేక గుంటూర్లోనే ఉంటున్న ఆయన గుండెపోటుతో మరణించారు. బాత్రూమ్ లో ఒకేసారి కుప్పకూలారు.

రాయలసీమ యాసలో విలనిజంలో తెలుగు ప్రేక్షకులకు ఆయన బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు ఆయన లేరన్న వార్త టాలీవుడ్ ను విషాదంలో నింపింది. జయప్రకాష్ రెడ్డి స్వస్థలం కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివేళ్ళ గ్రామం. ఈయన సినిమాల్లోకి రాకముందు ఎస్సైగా పనిచేశారు.

Leave a Comment