జనసేన పార్టీ అఫిడవిట్ .. మరి బిజెపి ఏమంటోంది..

Janasena Bij

రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద న్యాయ పోరాటం లో భాగం అవ్వాలి అని చెప్పి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా నిర్ణయించుకున్నారు. మొన్ననే హై కోర్ట్ అన్ని రాజకీయ పార్టీలకు రాజధాని విషయంపై నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పుకోవచ్చు అంటూ ఏదైనా ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పింది.

సో హైకోర్టులో ఈ విషయానికి సంబంధించి ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి జనసేన పార్టీ నిర్ణయించుకుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పొలిటికల్ వ్యవహారాల కమిటీతో సమావేశమై ఈ అమరావతి సంభందించి కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు కూడా మీడియాలో ప్రధానంగా వచ్చాయి. రాజధాని అనేది పర్యావరణ పరిరక్షణ రాజధానిగా ఉండాలని, వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతులకు అన్యాయం జరగకూడదని, ఆల్రెడీ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం కావద్దని జనసేన అభిప్రాయం పడింది. ( పరిపాలనా రాజధానిగా విశాఖే )

జనసేన మొదటి నుంచి కూడా అమరావతి రైతుల పక్షాన ఉంది దాన్ని కొనసాగిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అఫిడవిట్ అనేది ఈ మూడు ప్రాంతాల్లో ఈ రాజధాని వికేంద్రీకరణ ఉండకుండా అమరావతి లోనే ఉండాలి అని చెప్పి అఫిడవిట్ దాఖలు చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ జనసేన పార్టీ మరియు బిజెపి రెండూ ఉమ్మడిగా నిర్ణయాలను తీసుకుంటున్నాయి. ఒకవేళ జనసేన ఈ రకంగా అఫిడవిట్ దాఖలు చేస్తే , బిజెపి కూడా అమరావతి అనుకూలంగా ఏదైనా ఒక అఫిడవిట్ దాఖలు చేస్తుందేమో కూడా చూడాలి. బిజెపి వాళ్ళు చెబుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వేరు బీజేపీ వేరని, కేంద్ర ప్రభుత్వం రాజధాని విషయం రాష్ట్ర పరిధిలోనిది అన్నది కాబట్టి , ఇక్కడ బిజెపి పార్టీగ తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉండొచ్చు.

సో ఇక్కడ రెండు వేరు వేరు పార్టీలుగా విడివిడిగా అఫిడవిట్ దాఖలు చేస్తారేమో చూడాలి. ఈ విధంగా అఫిడవిట్ దాఖలు చేస్తే జనసేన పరిపాలన వికేంద్రీకరణ, 3 రాజధానిల అంశానికి వ్యతిరేకం అని చెప్పదలచుకున్నట్టే. జనసేన రాష్ట్ర బిజెపితో మాట్లాడిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు అనిపిస్తుంది. అమరావతికి అనుకూలంగా లేఖ రాసిన కన్నా లక్ష్మి నారాయణను తప్పించి సోము వీర్రాజును అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత నుండి అమరావతి విషయంలో ఈ రెండు పార్టీలు కాస్త వెనక్కి తగ్గినట్టు వార్తలు వినిపించాయి. మళ్ళీ ఇప్పుడు రాజధాని విషయమై అఫిడవిట్ దాఖలు చేసి హై కోర్టులో తమ వాదనలు వినిపిస్తే, ఎవరి అభిప్రాయాలు ఎలా వుంటాయో చూడాలి మరి.

Leave a Comment