వ్యూహాత్మకంగానే బంతిని సుప్రీమ్ కోర్టు బోనులోకి నెట్టిన జగన్ సర్కార్ !

నీటి వివాదం రాజేసి జగన్ సర్కార్ ను ఇరుకున పెట్టాలని చాలా మంది చాలా కలలే కన్నారు. అయితే వాటన్నిటినీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ముందుచూపుతో తిప్పికొట్టారు. ఏపీకి రావాల్సిన నీటి వాటా కోసం ఎంతవరకైనా పోరాడతామంటూ వ్యూహాత్మకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఇరు రాష్ట్రాల మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచనలు చేసింది. అయితే దీని ద్వారా ఏపీకి పెద్దగా ప్రయోజనం కాకపోగా ఈ విషయం తేలేందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని గుర్తించిన జగన్ సర్కార్.. మధ్యవర్తిత్వం కంటే న్యాయపరంగానే తేల్చుకునేందుకు మొగ్గుచూపింది. దీని ద్వారా ఏపీ జలాల వివాదాల కు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావిస్తోంది. ( గ్రామ సచివాలయ వ్యవస్థ )

2015 లోనే ఒప్పందం

కృష్ణా జలాలపై గతంలోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కేంద్ర జలవనరుల శాఖ మధ్యవర్తిత్వంలో 2015 లోనే ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం కృష్ణా జిల్లాలో 500 టీఎంసీలు ఏపీ, 300 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకుంటున్నాయి. ఐదేళ్లుగా ఇదే ఒప్పందం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఏపీ సర్దార్ పోతిరెడ్డిపాడు విస్తరణకు ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వడం సాకుగా చూపి తెలంగాణ నేతలు వివాదం సృష్టించే ప్రయత్నం చేశారు. కృష్ణా నీటిని వృధా చేస్తూ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొని అది రాజకీయ వివాదంగా మారింది. ( NDA సర్కార్ గట్టెక్కాలంటే )

ఈ విషయంలో ఏపీ, తెలంగాణలు భీష్మించుకు కూర్చోవడంతో వివాదం పెరిగి పెద్దదైంది. మధ్యవర్తిత్వం జరిగితే 2015 నాటికి ఒప్పందాన్ని తిరగదోడేందుకు అవకాశం వస్తుందని కెసిఆర్ ఆశించారు. దాని వల్ల ఎంతో కొంత తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుంది. దీనిని ముందుగానే గ్రహించిన సీఎం జగన్మోహన్ రెడ్డి న్యాయపరమైన పరిష్కారానికి మొగ్గుచూపారు. దీనివల్ల తక్షణం తెలంగాణకు వచ్చే లాభం ఏమీ ఉండదు. కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరూ చెప్పలేరు. అంతవరకు 2015లో కుదిరిన ఒప్పందమే అమల్లో ఉంటుంది. దీనివల్ల జలాల పంపిణీ నుంచి తక్షణ రాజకీయ ప్రయోజనం పొందవచ్చు అనుకున్న కెసిఆర్ ఆలోచనలు ఫలించే అవకాశం ఉండదు. పైపెచ్చు 2015లో ఒప్పందం టీఆర్ఎస్ ప్రభుత్వమే కుదుర్చుకుంది. దీని వలన ఎవరినీ తప్పు పట్టడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడింది.

మధ్యవర్తిత్వంతో లాభం లేదనే

నీటి విషయం రైతులకు ముడిపడి ఉండటంతో జగన్ సర్కార్ వారికి అన్యాయం జరక్కుండా పావులు కదుపుతోంది. మరోవైపు టిడిపి గోతి కాడ నక్కలా కాచుకుని కూర్చోవడంతో వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటోంది. సుప్రీంకోర్టు సూచించినట్లు మధ్యవర్తిత్వంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలి. ఏ మాత్రం తెలంగాణ వైపు మొగ్గు కనిపించినా ఏపీ ప్రభుత్వానికి రాజకీయ ఇబ్బంది తప్పదు. అందుకే న్యాయస్థానం పైన బాధ్యత ఉంచితే వైసిపికి కొత్త తలనొప్పి రాకుండా ఉండే అవకాశం ఉందని సీఎం జగన్ భావిస్తున్నారు. ( పక్క చూపు చూస్తున్న బీజేపీ నేతలు )

అక్టోబర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి సహా ప్రాజెక్టులు, కాలువల నిర్వహణ మొత్తం బోర్డు ఆధీనంలోకి తీసుకోనున్నారు. దీంతో అప్పుడు ఇరు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించడం తప్ప ఏమీ చేసేది ఉండదు. నీటి వివాదాన్ని రాజకీయంగా వాడుకోవాలని ఆశించిన తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రతిపక్ష టీడీపీ, కేంద్రంలోని బిజెపి సర్కార్ కు సీఎం జగన్ ఎంత మాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు. ఈ విషయంలో న్యాయపరంగానే తేల్చుకునేందుకు సిద్ధమవడం తెలివైన పాచికగా కనిపిస్తుందని రాజకీయ నిపుణులు అంటున్నారు.

Leave a Comment