IT Rides on Sonu sood ఈ మధ్య కాలంలో పరిచయం అక్కర్లేని పేరు సోనూసూద్. కరోనా అధికంగా వున్నా సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలే కాకుండా.. అంతకు మించి వేగంగా స్పందించి ఎన్నో వేల మందికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పేద,మధ్య తరగతి ప్రజలకు బాసటగా నిలిచాడు. ఆ విషయం మనందరికీ తెలిసినదే. అందుకు దేశమే దానికి సాక్ష్యంగా నిలిచింది కూడా.
సాధారణంగా ఎక్కడైనా ఎవరైనా మానవత్వంతో వంద రూపాయలు ఖర్చు పెడితేనే, ఏ స్వార్ధంతో చేస్తున్నాడో వీడు అని ఆలోచించే సమాజంలో ఉన్నాం మనం. అలాంటిది ఒక నటుడు వందల కోట్లు ఖర్చుపెట్టి వేల, లక్షల మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా మేలు చేస్తే దేశంలో ఉన్న రాజకీయ పార్టీలో .. మరో ఏదైనా వ్యవస్థలో తనమీద ఏదో ఒక మరక వేయకుండా ఉంటుందా చెప్పండి.
- మా బాబుగారు సింహంలా ఢిల్లీ వస్తే ఎవరూ పట్టించుకోరే.. !
- పాకిస్తాన్ లో తాలిబన్ జెండాలు.. ఉలిక్కిపడ్డ ఇమ్రాన్ ఖాన్
- పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ రాజీనామా..!
- చైనా గుప్పెట్లోకి శ్రీలంక దీవులు..భారత్ కు ముప్పు పొంచిఉందా ..?
- IT Rides on Sonu sood | సోనూసూద్ ఇంటిపై ఇన్కమ్ టాక్స్ దాడులు.. అందుకేనా.. !
అంతేకాకుండా సోనూసూద్ తాజాగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో వచ్చే ఎన్నికల నాటికి ముందుకు వెళ్లే దిశగా కనిపిస్తోంది. మరోవైపు ఉత్తరాఖండ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ముఖాముఖి పోటీకి సిద్ధపడుతున్నారు. ( Sonu Sood as mumbai mayor candidate | కాంగ్రెస్ పార్టీ కొత్త స్ట్రాటజీ ..! )
మరి ఇటువంటి పరిస్థితుల్లో సోనూసూద్ ఏమైనా వాళ్లకు ఒక అడ్వాంటేజ్ అవుతారేమోనని చెప్పి ఈ దేశాన్ని పరిపాలించే వారు.. ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఆలోచించకుండా ఉంటాయా. అందులోనూ ప్రస్తుతం సోనూసూద్ చుట్టూ రాజకీయ చర్చలే జరుగుతున్నాయి. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని కొందరు.. మరో పార్టీ నుంచి పోటీ చేస్తారని కొందరు అంటున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దానిని అయన ఖండించుకుంటూనే వచ్చారు కూడా. ( సోనూసూద్ తో పోటీ పడనున్న చంద్రబాబు.. ! )
తాను ఒక మానవత్వంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు సోనూసూద్. ఇలాంటి తరుణంలో తాజాగా సోనూసూద్ మీద ఇన్కమ్ టాక్స్ దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో 7 ప్రదేశాల్లో దాడులు మొదలుపెట్టారు. అనంతరం ఇందులో ఏంజరుగుతుందో.. ఎం లెక్కలు తెలుస్తారో చూడాలి. దాడులు జరిపి కేవలం వార్తల్లో నిలుపుతారా.. లేక దీనిని ఏదైనా రాజకీయంగా పెద్దలు వాడుకుంటారా చూడాలి.
2 thoughts on “IT Rides on Sonu sood | సోనూసూద్ ఇంటిపై ఇన్కమ్ టాక్స్ దాడులు.. అందుకేనా.. !”