ఇస్రో మరో ఘనత.. PSLV C50 ప్రయోగం..

విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. PSLV C50 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది.

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సరిగ్గా 3 గం. 41 నిమిషాలకు ఉపగ్రహాన్ని ప్రయోగించింది. సరిగ్గా ఇరవై నిమిషాల్లో CMS 01 సాటిలైట్ ను PSLV C50 తన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

PSLV C50ని అంతరిక్షంలోకి పంపేందుకు 25 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగించిన ఇస్రో ఎట్టకేలకు ప్రయోగాన్ని పూర్తి చేసింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని సెకండ్ లాంచ్ పాడ్ PSLV C50 నింగిలోకి దూసుకెళ్లింది.

CMS01 ద్వారా దేశంలో ఇకపై మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలకు దోహదపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీని పరిమితి భారత్ తో పాటుగా అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ వరకు విస్తరించనుంది.

ఇస్రో ఈ ప్రయోగం ద్వారా 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించినట్లు అయింది. మొత్తం 7 ఏళ్ల పాటు కక్ష్యలో తిరుగుతున్న ఈ శాటిలైట్ బరువు మొత్తం 1410 కిలోలు. ఇక ఇది PSLV C50 XL మోడల్లో 22వది అని ఇస్రో తెలిపింది.

అంతేకాకుండా షార్ నుంచి ఇది 77వ మెషిన్ అని భారత అంతరిక్ష సంస్థ తెలిపింది. PSLV C50 విజయవంతంగా CMS01 సాటిలైట్ ను కక్ష్యలోకి ప్రవేశ పెట్టినట్లుగా ఇస్రో చైర్మన్ డాక్టర్ K శివన్ తెలిపారు.

నాలుగు రోజుల్లో సాటిలైట్ తన స్థానానికి చేరుకుంటుందన్నారు. 11 ఏళ్ల క్రితం ప్రయోగించిన GSAT 11కు అనుబంధంగా CMS01 పని చేస్తుందని చెప్పారు. శాస్త్రవేత్తలు నిరంతరాయంగా పని చేయడం వల్ల ఈ ప్రయోగం విజయవంతమైనదని శివన్ పేర్కొన్నారు.

మొత్తంగా మన దేశ ఖ్యాతిని మరింత ఇనుమడింప చేసే విధంగా ముందుకు సాగుతున్న ఇస్రోను అభినందించాల్సిందే.

Leave a Comment