జగన్ ఢిల్లీకి వెళ్ళింది అందుకేనా ..!!

ఎన్డీఏ (NDA) కూటమికి శిరోమణి అకాలీదళ్ గుడ్ బై చెప్పింది. ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తున్నామని ప్రకటించింది. వ్యవసాయ బిల్లులు ఇటీవల చట్టరూపం దాల్చిన సంగతి తెలిసిందే.

అయితే బిల్లులను తొలినుంచీ అకాలీదళ్ వ్యతిరేకిస్తోంది, కానీ ఎన్డీఏ ప్రభుత్వం మొండిగా ముందుకెళుతోందని దీంతో కూటమి నుంచి వెళ్లి పోతున్నాము అని ప్రకటించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ (Harsimrat Kour) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే కూటమి నుంచి బయటకు వస్తున్నట్టు అకాలీదళ్ అధ్యక్షుడు సుక్బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు.

అకాలీదళ్ మరియు బీజేపీ(BJP) మధ్య దశాబ్దాలుగా మైత్రి వుంది. పంజాబ్, కేంద్రంలో కలిసి పనిచేస్తున్నాయి. కానీ వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ బయటకు వచ్చింది. వాస్తవానికి అకాలీదళ్ బయటకు రావడంతో ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిన ముప్పు కూడా ఏమీ లేదు. కానీ రాజ్యసభలో సభ్యుల బలం తగ్గుతుంది.

వ్యవసాయ బిల్లులపై రగడ ఇటీవలే ప్రారంభమైంది. కేంద్ర మంత్రి పదవికి కౌర్ రాజీనామా చేయగా ప్రభుత్వం నుంచి బయటకు రావాలని పార్టీ భావించింది. శనివారం అధ్యక్షుడు సుక్బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలో పార్టీ సమావేశం జరిగింది. వ్యవసాయ బిల్లు చట్ట రూపం దాల్చడంతో రైతులకు అన్యాయం జరుగుతోందని భావించింది.

గతంలో ఆర్డినెన్సు గా ఉన్న మూడు వ్యవస్థల చట్టాలను సవరణ బిల్లులో కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే వీటిపై పంజాబ్, హర్యానాల్లో రైతు సంఘాల నుంచి తీవ్ర నిరసన వెల్లువెత్తుతుంది. ఈ బిల్లుతో వ్యవసాయ ఉత్పత్తులకు ఇప్పటిదాకా రైతులకు ఇస్తున్న కనీస మద్దతు ధరకు కేంద్రం ముగింపు పలకనున్నదాని ఆయా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఎన్డీఏ బలం తగ్గుతోందా

ఇది రాజకీయంగా తమ పార్టీకి నష్టం కలిగిస్తుందని అకాలీదళ్ భవిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కూటమి నుంచి వైదొలిగింది. రానున్న రోజుల్లో మరిన్ని పార్టీలు ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ కూటమిలో ఎవరూ లేకపోయినా మోడీ ఐదేళ్లు కేంద్రాన్ని నడిపించగలడు. బిజెపికి పూర్తి మెజారిటీ ఉంది కానీ 2024 ఎన్నికలు అలా ఉండవు. కచ్చితంగా మోదీకి మిత్రుల సాయం అవసరం. అలాగే రాజ్యసభలో మద్దతు కావాలి. అందుకనే కొత్త మిత్రుల కోసం వేట మొదలు పెట్టింది.

ఆ దిశగా ఆలోచన చేస్తే ఏపీ నుంచి వైసిపికి , అమిత్ షా లకు మంచి మిత్రుత్వం కనిపిస్తోంది. ఈమధ్యనే జగన్ (YS Jagan) హటాత్తుగా ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. అందులో రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి అని చెబుతున్నారు. జగన్ ను ఎన్డీఏలోకి ఆహ్వానించారని అంటున్నారు. మరి జగన్ దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ ఇకపై ఎన్డీయేకు రాజ్యసభలో మెజారిటీ లేనందున జగనే మరింతగా ఆపద్బాంధవుడు కానున్నాడు. ఈ పరిణామాలను జగన్ ఏవిధంగా తన వైపుకి మల్చుకుంటాడో చూడాల్సి ఉంది.

Leave a Comment