చంద్రబాబు నిజంగా అలా చేయబోతున్నాడా.. !!

40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు ఎప్పుడు ఎటు వైపు దూకుతారో.. ఎటువైపు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో ఎవరికీ అంతగా అర్థం కాని మనిషి. ఎన్నికలు వస్తే ఒకలా.. ఎన్నికలు అయిపోయాక మరోలా మరే మనిషి చంద్రబాబు నాయుడు.

ఒక మాట ఇచ్చాం అంటే కచ్చితంగా అది జరిగి తీరాలి అని జగన్ ముందుకు వెళుతుంటే.. ఇచ్చిన మాటను తుంగలోకి తొక్కి ఏదైనా మాటమీద ఉండను అన్న మాదిరి చంద్రబాబు ముందుకు వెళ్తుంటారు. ఇలాంటివి గతంలో కూడా మనం చాలా సార్లు చూశాం. మళ్లీ ఇప్పుడు చూడబోతున్నాం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ చంద్రబాబు చేయబోతున్న ఆ దారుణాలను ఇప్పుడు చూద్దాం.

అధికారంలోకి రావడం అంటే ఆషామాషీనా

ఎన్నికల ఓటమితో చంద్రబాబు తన పొజిషన్ ఏంటి అనేది క్లియర్గా అర్థం అయింది అందరికీ. మళ్లీ ప్రజల్లోకి నమ్మకం సాధించి అధికారంలోకి రావాలి అంటే అంత ఆషామాషీ విషయం కాదు. అయితే లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలని కూడా ఆయన జీవిత ఆశయం అన్న సంగతి మనకు తెలుసు కదా.

తన జీవిత ఆశయం నెరవేర్చడానికి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు గారు ఎంతకైనా దిగజారుతారు.. తెగిస్తాడు కూడా. అందుకే నేమో బహుశా ఇప్పుడు కొత్త అస్త్రానికి తెరలేపబోతున్నాడు. ఏకంగా బీజేపీతో కలిసేందుకు ప్రజలకు ఏవిధంగా అర్థం కాకుండా కొత్త వ్యూహం రచిస్తున్నారట చంద్రబాబు.

విమర్శించిన నోటితోనే

ఎన్నికల సమయంలో మోడీని విమర్శించిన అదే నోరు ఇప్పుడు పొగుడుతూ వస్తుంది. ప్రత్యేక హోదా విషయంలో బిజెపిని టిడిపి పార్టీ ఎంత కార్నర్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ విషయం కేంద్ర పెద్దలైన అమిత్ షా గారికి, మోడీ గారికి కూడా తెలుసు. నేషనల్ పార్టీని టిడిపి పార్టీ చాలానే విమర్శించింది.

మోడీని గద్దె దించడానికి ఏకంగా కాంగ్రెస్ తో కలిసి నేషనల్ పాలిటిక్స్ లో వేలు కూడా పెట్టేసాడు అప్పుడు బాబు గారు. అయినా చంద్రబాబు అనుకున్నది కాలేదు. విధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరము చెప్పలేము కదా. అలాగే అప్పుడు ఎన్నికల ఫలితాలు రావడం.. కేంద్రంలో బీజేపీ నెగ్గడం.. రాష్ట్రంలో ఏకంగా వైఎస్ఆర్సిపి అదిరిపోయే సంఖ్యతో విజయం సాధించడంతో చంద్రబాబు పూర్తిగా కుప్పకూలిపోయాడు.

తన ఐడియా.. తన ఆలోచనలు అన్నీ కూడా నీరుగారిపోయాయి. కేంద్రం సంగతి అటుంచితే రాష్ట్రంలో దారుణంగా ఓడిపోవడం చంద్రబాబు కుమిలి కుమిలి పోయేలా చేసిందట. దీంతో మళ్లీ బి.జె.పి.తో జత కట్టి బలపడాలి అన్నది చంద్రబాబు ఆలోచన.

అంటే చంద్రబాబు ఎప్పుడు వీక్ అయినా కూడా ఓ రీఛార్జ్ మాదిరి పక్క పార్టీలపై ఆధారపడి ముందుకు వెళ్తూవుంటారు. చంద్రబాబు నిజంగా బీజేపీ వైపు వెళ్తే బీజేపీ దగ్గరికి రాణిస్తుందా.. నో ఛాన్స్ అంటున్నారు బిజెపి నాయకులు.

బిజెపి ఆ సాహసం చేస్తుందా

బిజెపినే కాదు.. ఇప్పుడు ఎవరూ కూడా చంద్రబాబు నాయుడును దగ్గరికి రానిచ్చే సాహసం చేయలేరు. ఎందుకంటే చంద్రబాబు పరిస్థితి ఏంటో, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు ఏంటో ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందో ప్రతి చిన్న పిల్లాడికి కూడా తెలిసిపోయింది.

చంద్రబాబు వస్తే కోలుకోలేని దెబ్బ కొడతాము అంటూ బిజెపి బలమైన ఐడియాతో రెడీగా వుందట. అయితే చంద్రబాబు ఆలోచనలకు పూర్తి విరుద్ధంగా బీజేపీ ఆలోచిస్తూ వస్తుంది. సోము వీర్రాజు అయితే జగన్ కంటే ఎక్కువగా చంద్రబాబును విమర్శిస్తూ పార్టీతో పొత్తుకు ససేమిరా అన్నట్టు గా వ్యవహరిస్తున్నారు ముందు నుంచి కూడా.

చంద్రబాబు మీద ఎప్పుడూ వాడివేడి బాణాలు వేసే బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ సోము వీర్రాజు.. చంద్రబాబు ఏపీలో అసలు ప్రతిపక్షమే కాదని తేల్చేశారట. ఆయన పక్కా కాంగ్రెస్ పక్షమట. నిజానికి కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు గుడ్ బై చెప్పేసి చాలా కాలం అయిపోయింది. ఆయన ఆ మధ్య సోనియా గాంధీ పెట్టిన ప్రతిపక్ష పార్టీ మీటింగ్ కి ఆహ్వానం వచ్చినా కూడా కనీసం రిప్లై లేదు.. పలుకు లేదు.

కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి పై, బిజెపి పార్టీ పై ప్రతిరోజు ఇప్పుడు హారతులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోము వ్యాఖ్యలు కూడా బిజెపితో చంద్రబాబు పొత్తు అసలు పెట్టడానికి కూడా వీలులేదు అన్న మాదిరిగా వుంది. ఇలా చంద్రబాబుకు కూడా చాలాసార్లు దెబ్బలు తగిలాయి.

చంద్రబాబు గారికి నడ్డి విరిగేలా ఒకసారి ఏదైనా అమలుచేసినట్టు అయితే అప్పుడు చంద్రబాబుకు అసలు ఎటు వెళ్లలేక దారులన్నీ మూసుకు పోతాయి. అయితే అధ్యక్షుడిగా ఉన్న సోముకు క్షమాపణ చెప్పిన అయినా బిజెపిలోకి వెళ్ళాలి అనేది చంద్రబాబు ఆలోచనగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏమో చంద్రబాబు తలుచుకుంటే ఏదైనా చేయగల సమర్ధుడు అంటుంటారు. బిజెపి పార్టీకి నా క్షమాపణలు.. నన్ను పార్టీలోకి ఆహ్వానించండి అంటూ చంద్రబాబు ముందుకు వస్తే బిజెపి అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇప్పుడు చంద్రబాబు వర్సెస్ బిజెపి అన్న విధంగా ఏపీలో రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పాలి.

Leave a Comment