అటు కృష్ణపట్నం .. ఇటు విశాఖపట్నం .. !!

కృష్ణపట్నం.. ఈ పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చేది ఆనందయ్య ఆయుర్వేదం మందు. గత కొద్దీ రోజులుగా ఎవరి నోటా విన్నా అదేపేరు . సోషల్ మీడియాలోనే కాకుండా దేశం మొత్తం ఆయన పేరు మారుమ్రోగిందనే చెప్పవచ్చు.

దీనికి ప్రధాన కారణం ప్రాణాంతక కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి తానూ తయారు చేసిన ఆయుర్వేద మందు. ఈ మందు వాడకం వలన ప్రాణాపాయం నుంచి బయట పడుతున్నారన్న వార్తలతో అందరు ఆ ముందుకు కృష్ణపట్నం కి పరుగులు పెట్టారు.

ఈ మందుపై పరిశోధనల అనంతరం నివేదికలను పరిశీలించిన హై కోర్ట్ .. మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఇప్పటికే ఈ మందు తయారీ విధానం , దానికి వాడే మూలికలకు సంబంధించి అన్ని టీవీ ఛానళ్లలో , యూట్యూబ్ వీడియోలలో ప్రచారం కూడా అయ్యింది. ( ONLINE LINK )

వీటిని ఆధారంగా చేసుకొని తానూ మందును తయారు చేసాను అంటూ ముందుకు వచ్చాడు విశాఖపట్నం కి చెందిన పొట్నూరు హరనాథ్ అనే బాలుడు. ఈ కరోనాను ఎదుర్కోవడానికి తానూ ఏదోఒకటి చేయాలన్న తపనతో.. ఆనందయ్య స్పూర్తితో ఈ మందును తయారు చేసినట్టు చెపుతున్నాడు.

Potnuru Harinadh
Potnuru Harinadh

హరినాధ్ ముందుకు అనుమతి లభిస్తుందా

హరినాధ్ చదివేది తొమ్మిదో తరగతే అయినప్పటికీ.. ఆయుర్వేద వైద్యంలో అనుభవమున్న వెంకన్నపాలెం కి చెందినటువంటి కన్నయ్య శెట్టి సహకారంతో ఈ మందును తయారు చేసినట్టు చెబుతున్నాడు. మందు తయారీకి తాటిబెల్లం,అల్లం,నేల ఉసిరి,దాల్చిన చెక్క,పసుపు,పిప్పళ్లు,మిరియాలు మరికొన్ని దినుసులు వాడారు.

ఈ మందును స్థానికులు కొంతమంది వాడినట్టు .. మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు వారు చెబుతున్నారు. దీనిని విషకః పట్నం ఆయుష్ అధికారులకు పంపిస్తామని, వారి అనుమతి తరువాతే ఈ మందును కరోనా బాధితులకు పంపిణీ చేస్తామని అక్కడి అధికారులు చెబుతున్నారు.

Leave a Comment