2000రూ..నోట్ ప్రింటింగ్ ఆపేశారా..!!

2000 రూ.. నోటు ముద్రణ నిలిపివేస్తున్నారన్న పుక్కర్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటువంటి ఊహాగానాలపై కేందం స్పందించింది. దీనిపై లోక్ సభలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. 2000రూ.. నోటు ప్రింటింగ్ నిలిపివేయడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్ధిక మంత్రిత్వ శాఖా లోక్ సభలో తెలిపింది.

ప్రజల లావాదేవీలు మరియు డిమాండ్ ను దృష్టిలోపెట్టుకుని దీనిపై ఆర్బీఐ తో చేర్చించి తరువాత తగు నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లేఖ ద్వారా లోక్ సభకు సమాధానం ఇచ్చారు. 2020-2021 సంవత్సరానికి గాను ఈ నోట్ల ముద్రణకు ఎటువంటి ఇండెంట్ ఇష్యూ చేయలేదని తెలిపారు. ( కరెన్సీ టు డిజిటల్ .. )

2019 మార్చి 31 నాటికి 32,910 లక్షల నోట్లతో పోల్చితే 2020 మార్చి నాటికి 27398 లక్షల నోట్లు చెలామణిలో ఉన్నాయని ఠాకూర్ తెలిపారు. కానీ ఆర్బీఐ లెక్కల ప్రకారం 2019-20 సంవత్సరంలో 2000 నోట్ల ముద్రణ జరగలేదని ఆర్బీఐ తెలిపింది. ఇంకా తన నివేదికలో ఒక్క నోటు కూడా ప్రింట్ చేయలేదని, 2000 నోటు చెలామణి కూడా బాగా తగ్గిందని పేర్కొంది. దీంతో 2000రూ.. నోటు ప్రింటింగ్ ఆపివేశారనే వార్తలు గుప్పుమన్నాయి.

ఈ అంశంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుతం వివరణ ఇచ్చింది. అయితే ఈ పింక్ నోట్లు కనబడక పోవడానికి కారణం, కొందరి బడా బాబుల లాకర్లలో దాచివుంచబడ్డాయని పలువురు ఆరోపిస్తున్నారు.

Leave a Comment