IPL ( ఇండియన్ ప్రీమియర్ లీగ్ ) దీని గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ లీగ్ మ్యాచ్ లను చూసేవారి సంఖ్యా కోట్లలో ఉంటది. ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెట్ టీం లనుండి ఎంపికచేసి ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేదే ఈ లీగ్.
ఇప్పటివరకు జరిగిన 12 ఐపీల్ సీసన్స్ అన్నీ విజయవంతంగా ముగిశాయని చెప్పవచ్చు. అభిమానుల కోలాహలం, చీర్ గర్ల్స్ ,వివిధ సినీ ప్రముఖులతో పాటు కిక్కిరిసిన జనంతో నిండిన స్టేడియాలు అనీ కలిసి సందడి చేశాయి.
కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రేక్షకులు లేకుండా స్టేడియాలు ఖాళీగా దర్శనమివ్వనున్నాయి. ఈ సారి షార్జా, దుబాయ్ మరియు అబుదాబి స్టేడియాలు ఈ లీగ్ మ్యాచ్లకు వేదికలు కాబోతున్నాయి. కోవిడ్-19 కారణంగా భారత్ లో జరగాల్సిన ఈ టోర్నీని బీసీసీఐ భారత ప్రభుత్వ అనుమతితో యూఏఈకి తరలించింది.
ఈరోజు చెన్నైసూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ ల మధ్య పోరుతో ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఎందుకంటే ఐపీల్ సాంప్రదాయం ప్రకారం చివరి సీజన్ లో ఫైనలిస్టులుగా నిలిచిన టీమ్స్ తో తర్వాత సీజన్ మొదలుపెడతారు.
తగు జాగ్రత్తలతో
మొత్తం ఈ మ్యాచుల్లో 8 జట్లు పాల్గొంటున్నాయి. వీరు బస చేసే హోటళ్లు కూడా వేరువేరుగా ఏర్పారుచేశారు. మ్యాచ్ లన్నీ ఖాళీ స్టేడియంలలో జరగనున్నాయి.
ఈసారి బీసీసీఐ నిబంధన ప్రకారం , మ్యాచ్ లో పాల్గొనే ఆటగాళ్లు వారి సహాయ సిబ్బంది సహా అందరూ మర్చి నుండి ఇప్పటివరకు తమ తమ ఆరోగ్య పరిస్థితి వివరాలను వెల్లడించాలి. దీని ప్రకారం ఈసారి వైద్య బృందాలు కూడా ఈ టోర్నీలో అందుబాటులో ఉంటాయి.
బయోసెక్యూలర్ వాతావరణాన్ని కాపాడేందుకు ఆటగాళ్లందరూ నియమ నిబంధనలను పాటించాలని లేనిచో ఐపీల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటారు.
స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగే ప్రమాదముందని, ఇది బయోసెక్యూలర్ వాతావరణానికి ప్రమాదమని, అందుకే స్థానిక పోలీసు శాఖ పరిధిలోని అవినీతి నిరోధక విభాగం నిఘా పెడుతున్నట్లు ఐపీల్ పాలక మండలి తెలిపిందని క్రికెట్ సమీక్షకుడు అయాజ్ మెమెన్ అన్నారు.
కోవిద్ నేపథ్యంలో వచ్చే అనేక మార్పులతో ఈ సారి టోర్నీ భిన్నంగా వుండబోతోంది.