ఐపీఎల్ డబుల్ ధమాకా ..

ఐపీఎల్‌ మ్యాచ్ ల సందడి గత రెండు వారాల నుండి కొనసాగుతుంది. సిక్సర్లు, ఫోర్లతో భారీ స్కోర్ లు కూడా నమోదు అవుతున్నాయి. ఈ సందడి మధ్య మరో డబుల్ ధమాఖా మొదలు కానుంది. ఈ శని, ఆదివారాల్లో డబుల్‌ మ్యాచ్‌ల హంగామాతో వినోదం రెట్టింపు కానుంది.

(నైట్‌ రైడర్స్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌) మరియు (బెంగళూరు వర్సెస్ రాజస్తాన్‌)

నైట్‌ రైడర్స్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ రేడు జట్లూ ఈ సీజన్ లో చెరో మూడు మ్యాచ్లు ఆడి అందులో రెండింట విజయం సాధించాయి. కానీ ఒకదానికొకటి తలపడటం ఇదే తోలి మ్యాచ్ కానుంది. ఇరు జట్ల మధ్య ఆటగాళ్లు బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పారంగం నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నెలకొంది. ఈ రోజు రాత్రి జరగ బోయే ఈ రెండు జట్ల కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్ కోల్‌కతా , కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

బెంగళూరు వర్సెస్ రాజస్తాన్‌
ఈ మ్యాచ్ మధ్యాహ్నం జరగనుంది. అక్కడి వాతావరం మధ్యాహ్నం వేడి, ఈ మ్యాచ్ పై కొంత ప్రభావం చూపనుంది. బ్యాటింగ్ వైఫల్యం కలవరంతో రాజస్థాన్ జట్టు, సూపర్ ఓవర్ విజయంతో ఆనందంలో బెంగళూరు జట్టు ఈ రెండు జతల మధ్య పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Leave a Comment