బైడెన్ వ్యూహం మరేదైనా వుందా : ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో బలగాల ఉపసంహరణపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి బలగాల ఉపసంహరణను సమర్థించుకుంటూ వచ్చారు. ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. 20 సంవత్సరాల తర్వాత బలగాలను వెనక్కి పిలిచేందుకు ఇదే సరైన సమయమని భావించినట్లుగా పేర్కొన్నారు. ( ఆఫ్ఘన్ లో పరిస్థితికి జో బైడెన్ వైఫల్యమే కారణమన్న డోనాల్డ్ ట్రంప్ )
గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకూడదని నిర్ణయం తీసుకున్నామని.. అయితే ఊహించిన దాని కంటే వేగంగా అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమై పోయిందన్నారు. అయితే అందుకు ఎలాంటి విచారం వ్యక్తం చేయడంలేదని ఆయన పునరుద్ఘాటించారు. సోమవారం వైట్హౌస్ నుంచి చేసిన టెలివిజన్ ప్రసంగంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
9/11 ఘటన తర్వాత ఆల్ఖైదా సంబంధాల కోసం తాలిబాన్లను శిక్షించే దాని ప్రారంభ లక్ష్యాలను మించి విస్తరించిన యుద్ధాన్ని ఆపడమే ప్రాధాన్యం అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో కేంద్రీకృత ప్రజాస్వామ్యం నిర్మించడం తమ లక్ష్యం కాదన్నారు. అమెరికా పై ఉగ్ర దాడులను నిరోధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. శాశ్వత సైనిక ఉనికి లేని దేశాలలో ఉగ్రవాదంపై పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదిక
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు
అమెరికా దళాలు నిష్క్రమించినప్పటికీ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. తాలిబన్లు మళ్లీ దాడులను ప్రారంభిస్తే వినాశకరమైన సైనిక ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ఆఫ్ఘాన్ లోని ప్రస్తుత పరిణామాలు విచారకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ఘాన్ ప్రజలకు అమెరికా మద్దతు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పుకొచ్చారు. ప్రాంతీయ దౌత్యం కోసం, ఆఫ్ఘాన్ హక్కుల కోసం పాటుపడతానని చెప్పుకొచ్చారు. ( నిర్దేశిత ప్రయోజనాలకు మాత్రమే eRUPI )
ప్రస్తుతం ఆఫ్ఘన్ లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నగా పేర్కొన్నారు. వేగంగా ప్రతిస్పందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో బిన్ లాడెన్ను పట్టుకునేందుకు తాము వెనక్కి తగ్గలేదని.. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ కేంద్రంగా అమెరికా పై ఆల్ల్ఖైదా దాడి చేయలేదని.. 20 ఏళ్ల కిందటే ఖచ్చితమైన ప్రణాళికతో ఆఫ్ఘన్ వెళ్లి ఆల్ల్ఖైదాను అంతం చేస్తామని చెప్పారు.
అయితే ఆఫ్ఘనిస్తాన్ పై తాలిబాన్లు పట్టు సాధించడానికి అగ్రరాజ్యం అమెరికానే ముమ్మాటికీ కారణమనే విమర్శలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన పలు పత్రికలతో పాటు, బ్రిటన్ నుంచి వెలువడుతున్న పత్రికలు కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై ముప్పేట దాడి చేస్తున్నాయి. ఇది ఆఫ్ఘనిస్థాన్ కు బైడెన్ లోగిపోవడమే అని అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపార దినపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ రాసుకొచ్చింది. అఫ్గాన్ లో తాలిబన్ల పట్ల బైడెన్ అనుసరించిన విధానాన్ని తూర్పారబట్టింది.
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదిక
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు
- కుప్పం మున్సిపాలిటీలో Ex-Officio సభ్యునిగా దరఖాస్తు.. బాబు పరిస్థితి ఇలా అయ్యిందేంటి..?
- పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నప్పుడు ఏమైపోయారు బాబు గారు ..?
- ఇరు పార్టీలు సంయమనం పాటించండి.. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ
బైడెన్ వ్యూహం మరేదైనా వుందా
ఈ సందర్భంలో అమెరికాపై మరో విమర్శ కూడా వినిపిస్తోంది. అదేంటంటే 20 సంవత్సరాలపాటు ఆఫ్ఘాన్ పై కొన్ని లక్షల కోట్లు ఖర్చుపెట్టిన అమెరికా, ఇటువంటి దారుణమైన పరిస్థితులలో ఆఫ్ఘన్ ను వదిలి నిజంగానే ఓటమిని ఒప్పుకొని వెళ్లిపోయిందా. అంతర్జాతీయంగా ఇన్ని విమర్శలను కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడిందా. అమెరికా సైన్యం తిరిగి వెళ్ళిపోతే తాలిబన్లు ఆఫ్ఘన్ ను ఆక్రమించుకుంటారన్న విషయం వీరికి తెలియదా. నిజంగానే 20 సంవత్సరాల అమెరికన్ ట్రైనింగ్ వున్న సైన్యం రాత్రికిరాత్రే ఎందుకు పారిపోయింది. ఆఫ్ఘన్ అధ్యక్షుడు ఎందుకు పారిపోయాడు. ఆ అధ్యక్షుడికి అమెరికానే ఆశ్రయం ఇవ్వాలనుకుంటోందన్న వార్తలు వస్తున్నాయి. ఇటువంటి ఎన్నో విమర్శలు వెలువడుతున్న నేపథ్యంలో ఇందులో ఏదైనా వ్యూహం వుందా.. లేక తాలిబాన్లకు మరియు అమెరికాకు మధ్య ఏదైనా రహస్య ఒప్పందాలు ఏమైనా జరిగాయా అన్న చర్చలు కూడా మొదలయ్యాయి.
More Latest telugu news today, Online telugu news today, Political news, online news today