Integrated Battle Groups | పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని తన విధానంగా మార్చుకున్నట్లు మరోసారి స్పష్టమైందని రక్షణశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఉగ్రవాదులకు ఆయుధాలు, నిధులు, ట్రైనింగ్ ఇస్తూ భారత్ ను టార్గెట్ చేస్తోందని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో మారుతున్న పరిణామాలు భారత్ కు సవాల్ అని.. అందుకే భారత్ తన వ్యూహాలను మారుస్తోందని తెలిపారు. క్వాడ్ దేశాల కూటమి ఏర్పాటు భారత వ్యూహంలో కీలకమైన అడుగు అని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.
Integrated Battle Groups తో వేగంగా నిర్ణయాలు
ఇంటిగ్రేటెడ్ బాటిల్ గ్రూప్స్ ( Integrated Battle Groups ) ఏర్పాటు చేయడంపై రక్షణ శాఖ సీరియస్ గా పని చేస్తుందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. యుద్ధ సమయాల్లో చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని.. ఈ ఇంటిగ్రేటెడ్ బాటిల్ గ్రూప్స్ (Integrated Battle Groups ) ఏర్పాటుతో వేగంగా నిర్ణయాలు తీసుకోడానికి వీలవుతుందని ఆయన చెప్పారు. మనదేశంలో ఇంటిగ్రేటెడ్ ఫైటింగ్ యూనిట్స్ పెంచడంపై దృష్టి పెట్టామని కూడా చెప్పారు.
వ్యూహాత్మక రహదారుల ప్రారంభంతో ప్రత్యర్థులకు చెక్ పెట్టనున్న భారత్.. !
యువతలో దేశ భక్తి పెంచడంతో పాటుగా.. క్రమశిక్షణ, ఆర్మీ పాటించే విలువలను పెంపొందించడానికి కృషి చేస్తున్నామన్నారు. మన దేశ యువతకు ఆర్మ్డ్ ఫోర్స్ ను దగ్గర చేసేలా టూర్ ఆఫ్ డ్యూటీని ( Tour of Duty ) ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. యూత్ ఆర్మీలోకి వచ్చేందుకు ఈ రకమైన ప్రోగ్రామ్స్ ఉపయోగపడతాయని ఆశిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఆఫ్ఘన్ పై భారత్ పునరాలోచన చేస్తోందని.. కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ వెల్లడించారు. అవసరమైతే ఆఫ్ఘన్ గడ్డపైకి వెళ్లి సైనిక ఆపరేషన్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
- జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోసం చంద్రబాబు ఆరాటం.. అది సాధ్యమవుతుందా.. ?
- అసెంబ్లీ రద్దు చేయాలంటున్న టీడీపీ.. మరి ముందస్తు ఎన్నికలకు రెడీనా..!
- వినాయకుడు | లోకరక్షకుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు
- నారా లోకేష్ పాదయాత్ర.. నాయకుడిగా సక్సెస్ అవుతాడా.. ?
- బీజేపీ సరికొత్త వ్యూహం.. బెంగాల్ విభజన రాగం..!
గత ఏడాది భారత్, చైనా సరిహద్దులో ఏర్పడిన వివాదం తీవ్రమైన పరిస్థితులకు దారితీసిందని గుర్తు చేస్తూ.. మన సైనికులు చాలా సహనంతో అప్రమత్తంగా ఆ పరిస్థితులను ఎదుర్కొన్నారని తెలిపారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను ఏకపక్షంగా మార్చాలని చైనా ప్రయత్నించడంతోనే అటువంటి పరిస్థితి దాపురించిందన్నారు. ఈ సంఘటన తర్వాత ఎటువంటి యుద్ధానికి అయినా.. ఎలాంటి పరిస్థితినైనా.. ఏ ప్రదేశంలోనైనా ప్రమాదాలను లెక్కచేయకుండా ఎదుర్కోవడానికి మన సైన్యం అప్రమత్తంగా ఉన్నట్లు స్పష్టం అయిందని రక్షణ మంత్రి తెలిపారు. అదే మన జాతీయ భద్రతకు భరోసా ఇస్తోందని చెప్పారు.
తాలిబన్ల అధీనంలోకి ఆఫ్ఘనిస్థాన్.. ప్రాణభయంతో పరుగులు
మనం బలంగా ఉన్నామని.. అవసరమైతే ప్రతి చర్యకు సిద్ధమనే సంకేతాలు ఇవ్వడం కారణంగానే భారత్-పాక్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ విజయవంతంగా అమలు జరుగుతోందని స్పష్టం చేశారు. భారత్ రక్షణాత్మక వైఖరిని వీడి ప్రతిస్పందించడం ప్రారంభించిందని పాక్ కు తెలుసునని పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. దేశ రక్షణ విషయంలో రాజీ ధోరణి అనుసరించడం లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉండటం కారణంగానే ఉగ్రవాద కార్యకలాపాలను అదుపు చేయగలుగుతున్నామని తెలిపారు. 2016లో బాలాకోట్ దాడులతో ఈ విషయం ప్రపంచానికి తెలిసొచ్చిందని గుర్తు చేశారు. తమిళనాడులోని వెల్లింగ్టన్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో మాట్లాడిన రక్షణమంత్రి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
More Latest telugu news today, Online telugu news today, Political news, online news today
3 thoughts on “Integrated Battle Groups | అన్నిటికీ రక్షణశాఖ సిద్ధమన్న రాజ్ నాథ్ సింగ్ !”