చైనా నానాటికీ ప్రపంచ శత్రువుగా మారిపోతోంది. ఇప్పటికే భారత్ సరిహద్దు దేశాలతో కుస్తీ.. ఉగ్రవాద దేశాలతో దోస్తీ .. కరోనా వ్యాప్తి మూలంగా కమ్యూనిస్టు దేశంతో అన్ని దేశాలు కమ్యూనికేషన్ కట్ చేసుకుంటున్నాయి. దౌత్య, వాణిజ్య బంధాలు మసక బారుతున్నాయి. చైనా కంపెనీ అంటే చాలు దేశాలన్నీ బద్ద శత్రువును చూసినట్లు చూస్తున్నాయి. దీంతో నిన్న మొన్నటి దాకా టాప్ లిస్టులో కొనసాగిన చైనా కంపెనీలు దివాళా దిశగా పరుగులు పెడుతున్నాయి. తాజాగా చైనా అతిపెద్ద కంపెనీ హువావే ( huawei )కి కోలుకోలేని దెబ్బ తగిలింది. 5g technology లో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉన్న ఆ కంపెనీకి భారత్-జపాన్ కలిసి చుక్కలు చూపించాయి.
భారత్-జపాన్ ల భారీ ఒప్పందం
మరోవైపు టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో జపాన్ చైనా కంపెనీలతో 5G ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఇది చైనాకు పెద్ద షాకింగ్ న్యూస్. 5G , ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కీలక రంగాల అభివృద్ధి కోసం భారత్-జపాన్ కలిసి కీలక ఒప్పందం చేసుకున్నాయి. 13వ భారత్, జపాన్ విదేశాంగ మంత్రుల వ్యూహాత్మక సమావేశంలో ఈ ఎగ్రిమెంట్ కుదిరింది. దీంతో తూర్పు దేశంతో భారత స్నేహ బంధం మరింత బలపడటమే కాకుండా 5జీ టెక్నాలజీని గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్న చైనాకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది.
చైనా నుంచి సవాళ్ల నేపథ్యంలో భారత్, జపాన్ బంధం పరస్పర వ్యూహాత్మక బంధంగా మారింది. తాజాగా భారత విదేశాంగమంత్రి జయశంకర్ జపాన్ విదేశాంగ మంత్రితో టోక్యోలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై అంగీకారం కుదిరిందని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సంబంధాలు మరింత విస్తృత పరుచుకునేలా ఈ చర్చలు జరిగాయి. ప్రస్తుతం ఐటి అవసరాల నేపథ్యంలో 5జీ టెక్నాలజీ దిశలో కుదిరిన ఒప్పందం అత్యంత కీలకంగా మారనుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహృద్భావ వాతావరణం నిలబడడానికి ఈఒప్పందం దోహద పడుతుంది.
ఈ విషయములో జపాన్ సారథ్య బాధ్యతలు తీసుకోవాలని భారత్ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ కు భారత్ మద్దతు తెలిపింది. ఈ చర్యతో చైనా తన సైనిక ఉనికిని బలోపేతం చేసుకుంటూ పోతున్న ఇండో పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో జపాన్ చెక్ పెట్టనుంది. ఈ క్రమంలో జపాన్ కు భారత్ నుంచి పూర్తి సహకారం అందనుంది. ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని భద్రతాయుతంగా తీర్చిదిద్దేందుకు ఐపిఒఐని ఓ రోడ్ మ్యాప్ గా ఎంచుకున్నారు. ఇప్పుడు జరిగినటువంటి 13వ ఇండియా జపాన్ విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం దీనికి బాటలు వేసింది. ఈ దశలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల పై ఇరుదేశాలు ప్రత్యేక దృష్టి పెట్టనున్నాయి.
huawei కి పెద్ద దెబ్బ
ఇరు దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందం ద్వారా 3rd కంట్రీస్లో భారత్, జపాన్ సహకారం మరింత విస్తరించనుందని విదేశాంగ మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి భారత్-జపాన్ 5జి ఒప్పందంతో ఈ technology కి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకుంటున్న హువావే కి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. నిజానికి భారత్లో 5g టెక్నాలజీ విస్తరణకు సంబంధించి హువావేతో ఒప్పందం జరగాల్సి ఉంది. అయితే భారత్ తో వివాదాలు పెట్టుకుని ప్రపంచంలోనే అతి పెద్ద 5 మార్కెట్ ను చేజార్చుకుంది హువావే. ఇది ఆర్థికంగా హువావేతో పాటుగా చైనాకు కూడా కోలుకోలేని దెబ్బ అంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …