అమెరికాతో పోటీ పడుతున్న భారత్ ..?

భారత్ అమెరికాతో పోటీ పడటం అంటే ఏ టెక్నాలజీలోనో , అభివృద్దిలోనో కాదండి మనం మాట్లాడుకునేది. కరోనా కేసుల గురించి. అదేనండి ఇప్పటివరకు కరోనా కేసుల్లో ప్రపంచంలోనే అగ్రభాగాన నిలిచింది అమెరికా. కానీ ఇండియా ఈ విషయంలో అమెరికాతో పోటీ పడి భారత్ రెండోస్థానానికి చేరింది. మరికొన్ని రోజుల్లో ఈ పరిస్థితి మారి భారత దేశమే ప్రపంచంలో మొదటి స్థానానికి చేరే ప్రమాదం కనిపిస్తోంది.

ప్రస్తుతం అమెరికాలో సోమవారం నాటికి 67లక్షల 21వేల 588 కేసులు నమోడికాగా ఇండియాలో 48లక్షల 46వేల 427 కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజూ మన దేశంలో నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తుంటే, వీటి మధ్య తేడా చాలా కనిపిస్తున్నప్పటికీ అమెరికా కంటే ఇండియాలో భారీగా ఉంటోంది. ఆదివారం అమెరికాలో 41,448 కేసులు నమోదైతే ఇండియాలో 94,372 కేసులు నమోదయ్యాయి. అదే సోమవారం అమెరికాలో 27,419 కేసులు నమోదైతే ఇండియాలో మాత్రం 92,071 కేసులు నమోదయ్యాయి. అంటే ఒక్కరోజులోనే నాలుగు రెట్లు కేసులు అమెరికా కంటే ఎక్కువ నమోదయ్యాయి. ( రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి విడుదల )

గత కొద్దీ రోజుల నుండి భారత్ లో కేసుల నమోదు తీవ్రత ఇదే విధంగా కొనసాగుతూ వస్తుంది. ఇక ముందు రోజుల్లో కూడా ఇలాగే కొనసాగితే త్వరలోనే ఇండియా అమెరికాను దాటి కరోనా కేసుల విషయంలో ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరవచ్చని ఇండియా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఇండియాలోని చాలా రాష్ట్రాలలో కరోనా టెస్టుల సంఖ్య చాలా తక్కువగా నమోదు అవుతుంది. దీంతో కేసుల సంఖ్య కూడా చాలా తక్కువగా కనిపిస్తోందని, టెస్టుల సంఖ్య పెంచితే ఈ పాటికే అమెరికాను దాటేసే వాళ్లమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కరోనా కేసుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా.. ఇంకా మెరుగైన చర్యలు చేపడితేనే ఈ కోవిద్-19 నుంచి దేశం బయటపడుతుందని ప్రజలందరి అభిప్రాయం.

Leave a Comment