భారత్ నిర్ణయంతో బోర్డర్లో బోల్తా కొడుతున్న డ్రాగన్ కంట్రీ.. !

డ్రాగన్ కంట్రీ చైనాతో యుద్ధం కోసం భారత్ కొత్త కొత్త మార్గాలను, వ్యూహాలను అనుసరిస్తోంది. శత్రువు బలంగా ఉన్నప్పుడు మన శక్తికి మించిన వాడైనప్పుడు సరైన వ్యూహంతోనే మట్టుబెట్టగళం. గత నాలుగు నెలల కాలంలో చైనాను రెండు సార్లు భారత్ ఓడించడం వెనుక గల రహస్యం కూడా ఇదే.

గాల్వన్ లోయ,లఢక్ లోయలో చైనా ఆర్మీ పై భారత జవాన్లు పూర్తి పైచేయి సాధించారు. ఇప్పుటి దాకా చైనా, ఇండియా దేశాల సైన్యాలు కేవలం బాహాబాహీ గానే తలపడ్డాయి. ఆయుధాలు లేకుండా కర్రలు, రాళ్ళు, కాళ్లు, చేతులతోనే మార్షల్ ఆర్ట్స్ ను .. వీధి ఫైట్స్ ను తలపించేలా పోరాడాయి. వీటిలో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి లోబడి యుద్ధాలు చేసుకోవడం వలన డ్యామేజ్ తక్కువగా జరిగింది. ఈసారి చైనా ఎటాక్ చేయాలి అనుకుంటే పూర్తిస్థాయి యుద్ధం చేయడం గ్యారెంటీ అనే వాదనలు వినిపిస్తున్నాయి.

రెండుసార్లు ఓడిపోయిన తర్వాత మరోసారి ఇండియా చేతిలో పరాభవం పొందితే చైనా ఆర్మీ పై నమ్మకం పోవడం ఖాయం. ఆదేశం పై ఇతర దేశాలకు ఉన్న భయం సడలిపోతుంది. అందుకే పక్కాగా అడుగులు వేయడానికి సిద్ధమవుతోంది డ్రాగెన్. ఇటు ఇండియా సైతం తన అమ్ములపొదిలో విస్తరించుకుంటోంది. చైనాను కట్టడి చేయాలని.. ఆ దేశం ముందడుగు వేసినా చుక్కలు చూపించాలని.. తన పవర్ ఏంటో నిరూపించాలని భావిస్తోంది ఇండియా.

Mq9 2

ఇది 1962 కాదు.. 2020 అని చాటాలని భావిస్తోంది భారత్. అందుకే ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ విమానాలు, బాంబర్లు, వార్ హెలికాప్టర్లను దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు చైనా ను ముందుగానే కట్టడి చేయడానికి ఏం చేయాలని భావిస్తున్న ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి యుద్ధప్రాతిపదికన దిగుమతి చేసుకుంటున్న MQ9, డ్రోన్ యుద్ధ విమానాలను, laser guided missile లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఇండియా. ఇది ఊహించని సంచలన నిర్ణయం అని మిలట్రీ వర్గాలే చెబుతున్నాయి.

వీటి ప్రాముఖ్యత

అమెరికా సైతం ఇటీవలే ఈ నిఘా యుద్ధ విమానాలను తన అమ్ములపొదిలో చేర్చుకుంది. 2018 ఏడాది చివర్లోనే ఇవి అమెరికా మిలటరీలో చేరాయి. ప్రపంచంలోనే ఇంతటి అత్యధిక ఆధునిక యుద్ధ విమానాలు లేవు. భారీ కెమెరాలు,ఆకాశం నుండి జల్లాడపట్టే అత్యాధునిక కెమెరాలు ఈ యుద్ధ విమానాల సొంతం. ఎలాంటి వాతావరణంలో అయినా సరే ఇవి పని చేస్తాయి. శత్రువు రాడార్ల కళ్లుగప్పి గస్తీ కాయడం, ఆకాశం నుండి ప్రతి క్షణం డేగ కళ్ళతో భూమిమీద పరిస్థితిని పరీక్షించి ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు పంపడం MQ9 యుద్ధవిమానాల ప్రత్యేకత.

సాధారణంగా అనేక యుద్ధ విమానాలు అంటే చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ MQ9 అతిపెద్ద లోహ విహంగం. గద్ద కన్నులతో ఆకాశము నుండి చిన్న చిన్న ఇసుకరేణువులను సైతం జల్లెడ పట్టడం వీటి ప్రత్యేకత. చైనా లాంటి ప్రత్యర్థి బోర్డర్లో ఉన్న సమయంలో దేశానికి కావాల్సినవి ఇలాంటి యుద్ధ నిఘా విమానాలే. ఇవే ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. ఇండియా, చైనా మధ్య సుమారు నాలుగు వేల కిలోమీటర్ల బోర్డుర్ ఉంది. అందులోనూ అత్యంత శీతల, అత్యంత ఎత్తైన మంచు కొండల ప్రాంతం కావడంతో ఇక్కడ కాపలా కాయడం చాలా కష్టమైన క్లిష్టమైన వ్యవహారం. అందుకే యుద్ధప్రాతిపదికన మానవరహిత యుద్ధ విమానాలు కావాలి అంటూ అమెరికాను కోరింది మోడీ సర్కార్.

ఇటీవల వీటి కోసం భారత్ మిలటరీ రంగ నిపుణులకు అమెరికాను సందర్శించి వచ్చారు కూడా. MQ9 మానవరహిత యుద్ధ విమానాలను పరిశీలించి వాటిని కావాలని కోరడంతో వెంటనే అమెరికా ఇండియా కి ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వీటి పనితీరు సామర్థ్యం తెలిసి చైనా షాక్ అయిపోతోంది. ఇంతటి అత్యాధునిక విమానాలు బోర్డర్ లో ఉంటే తమ పప్పులు ఉడకవు అని అంచనా వేస్తోంది చైనా. ఇవి తమ కదలికను సైతం ఈజీగా పసిగడుతుందని చైనా మిలిటరీ ఆ దేశ అధినాయకత్వానికి తేల్చి చెప్పారు. చైనా బోర్డర్ లో చీమ చిటుక్కుమన్నా ఇవి పసిగట్టేస్తాయి. దీంతో వాస్తవాధీన రేఖ వెంబడి ఏం జరిగినా సరే ఇకపై ఇండియాకి సెకండ్లలో తెలిసిపోవడం ఖాయం.

laser guided missile

వీటికి తాజాగా భారత రక్షణ రంగం సంస్థ డీఆర్డీవో అభివృద్ధి పరిచిన laser guided missile కలపాలని ఇండియన్ మిలిటరీ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో వాస్తవాధీన రేఖ సమీపంలో చైనా చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో మనకు తెలియజేయడం గ్యారెంటీ. భారత్ నిర్ణయం తెలిసి చైనా రెడ్ అలెర్ట్ అయింది. ఇండియా తన అమ్ములపొది శక్తివంతం చేసుకుంటున్న తీరుకి చైనా వణికిపోతోంది. మరి భారత్ వ్యూహానికి చైనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Leave a Comment