74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.

మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండాని ఎగురవేశారు.

అనంతరం జాతినుద్దేశించి మాట్లాడుతూ .. జమ్మూకాశ్మీర్ లో అభివృద్ధి వేగంగా పరుగెడుతోందన్నారు.తొలిసారి మహిళలు, ఎస్సీలకు హక్కులు దక్కాయన్నారు.కార్గిల్ ను సంపూర్ణ సేంద్రియ ప్రాంతాలుగా మారుస్తామని, లద్దాఖ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు రోడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేస్తామని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోరాడుతోందన్నారు.

పొరుగు దేశాలతో సంబంధాలను కోరుకుంటూనే, చైనా దేశం నుండి వస్తువుల దిగుమతి అరికడతామన్నారు. కరోనా తో ప్రపంచంతో పాటు మన దేశం కూడా పోరాడుతోందని, దీని కోసం కష్టపడుతున్న డాక్టర్లకు , సిబ్బందికి కృతఙ్ఞతలు తెలిపారు. త్వరలోనే వాక్సిన్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

జెండా ఆవిష్కరణలో ఏపీ సీఎం వైయస్ జగన్ ..
Jagan

ఏపీలో వైయస్ జగన్ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో తాను ప్రసంగిస్తూ .. రాజ్యాంగం, చట్ట ప్రకారం వ్యవస్థలు నడిస్తేనే సమాజానికి మంచి జరుగుతుందని, సామజిక మరియు ఆర్ధిక న్యాయమే వారి ముఖ్య ఉద్దేశమని అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Leave a Comment